నారా లోకేష్ టీడీపీలో నెం.2గా ఉన్నారు. నారా లోకేష్‌కు టీడీపీ పగ్గాలు అప్పజెప్పాలని కొందరు డిమాండ్ చేశారు.
నారా లోకేష్ టీడీపీలో నెం.2గా ఉన్నారు. నారా లోకేష్‌కు టీడీపీ పగ్గాలు అప్పజెప్పాలని కొందరు డిమాండ్ చేశారు. నారా లోకేష్‌ను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్‌ను కొంత హైడ్ చేశారన్న వార్తలు వచ్చాయి. నారా లోకేష్‌ను లైంలైట్‌లోకి తీసుకురావాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు కోరుతున్నారు. నారా లోకేష్ భవిష్యత్ గురించి ఆలోచించాలని అంటున్నారట. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు తర్వాత ఎక్కువ ఫోకస్‌లోకి వచ్చింది పవన్ కల్యాణ్. ఆరేడు నెలల కాలంలో ప్రభుత్వంలో సగభాగం నేనే అన్న తరహాలో పవన్ వ్యవహరిస్తున్నారు. పవన్‌కల్యాణ్‌కు ఉన్న సొంత, సినిమా ఇమేజ్‌తో ముందుకు వెళ్తున్నారు. ఆయన వ్యాఖ్యల వల్ల ఒక అటెన్షన్ వస్తుంది. బీజేపీ భావజాలానికి దగ్గరగా పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. సౌతిండియాలో హిందూ మతంపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. సౌతిండియాలో బీజేపీకి ముఖ్య నాయకుడిగా మారారు. ఈ నేపథ్యంలో పవన్ ఇమేజ్‌కు ఒక గ్రావిటీ పెరుగుతూ వస్తోంది. దీంతో ఈ అంశం టీడీపీ నేతలకు మింగుడుపడడం లేదు. దీంతో లోకేష్‌ను ప్రమోషన్ చేయాలి కదా అన్న వాదన టీడీపీలో వస్తోంది. ఈ క్రమంలో టీడీపీ తదుపరి కార్యాచరణ ఏంటి అనే అంశంపై 'జర్నలిస్టు YNR' విశ్లేషణ ఈ వీడియోలో..!