శాసనమండలి వేదికగా నారా లోకేష్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను తాను నిజాయితీపరుడిననే ప్రయత్నం చేశారు.

శాసనమండలి వేదికగా నారా లోకేష్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను తాను నిజాయితీపరుడిననే ప్రయత్నం చేశారు. గవర్నర్‌ ప్రసంగంలో 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి, 4 లక్షల మందికి ఉపాధి కల్పించారు అని ఉంటే.. ఎక్కడ పెట్టుబడులు వచ్చాయి.. ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి అని మండలిలో వైసీపీ ప్రశ్నించింది. నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు కదా ఎక్కడ వచ్చాయో చూపించాలని వైసీపీ డిమాండ్ చేయడంతో లోకేష్‌ తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. 6.5 లక్షల పెట్టుబడులు గ్రౌండ్‌ అవుతున్నాయి.

రెండున్నరేళ్లలో నాలుగులక్షల మందికి ఉపాధికల్పిస్తామని చెప్పామని, ఇప్పటికే కల్పించామని చెప్పలేదన్నారు. కానీ గవర్నర్‌ ప్రసంగంలో 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు, 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడిందని ప్రింట్‌ అయింది. ఇది ఎలా ప్రింట్‌ అయినప్పటికీ రెండున్నరేళ్లలో కల్పిస్తామని లోకేష్‌ చెప్పారు. ఇది ఒక రకంగా మంచిపరిణామమే...ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!



ehatv

ehatv

Next Story