పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ విజయానికి వర్మ చాలా కృషి చేశారు. వర్మ కారణంగానే పవన్ గెలిచారు.

పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ విజయానికి వర్మ చాలా కృషి చేశారు. వర్మ కారణంగానే పవన్ గెలిచారు. పిఠాపురంలో వర్మ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన చరిత్ర ఆయనకుంది. పవన్‌ అక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయంచడంతో తొలుత వర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్మ అనుచరులు కూడా అసంతృప్తి వెళ్లగక్కారు. ఆ తర్వాత వర్మను అధిష్టానం బుజ్జగించింది. పవన్‌ కల్యాణ్‌ విజయానికి కృషి చేయాలని అధిష్టానం చెప్పడంతో వర్మ వెనక్కి తగ్గారు. అధిష్టానం చెప్పినట్లు వర్మ పవన్ గెలుపునకు కృషి చేశారు. ఎన్నికల తర్వాత కూడా పవన్, వర్మ కలిసే ఉన్నారు. మీడియా పరంగా వర్మను కాపాడుకుంటామని చంద్రబాబు అన్నారు. వర్మను గౌరవించుకుంటామని చంద్రబాబు అన్నారు. శాసన మండలికి పంపిస్తామన్నట్లు టీడీపీ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ చేయబోతున్నారని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే మొదటి సారి ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలలో వర్మకు అవకాశం ఇస్తారని భావించారు.. కానీ ఆయనకు అక్కడ స్థానం దక్కలేదు. తాజాగా ఖాళీ అయిన స్థానాల్లో వర్మకు స్థానం కల్పిస్తారని అనుకున్నారు కానీ, అనూహ్యంగా ఆయనకు ఎమ్మెల్సీ రాలేదు. ఆయనకు ఎమ్మెల్సీ రాకపోవడం వెనుక పవన్ ఉన్నారని విస్తృత చర్చ జరుగుతోంది. వర్మ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారని భావించారు. వర్మకు, జనసేనకు మధ్య గ్యాప్‌ పెరిగిందనేది పిఠాపురం రాజకీయం గమనిస్తున్నవారు ఎవరైనా చెప్తారు. ఆ మధ్య ఓ ట్వీట్‌ చేసి మళ్లీ డిలీట్‌ చేశారు. పవన్ కల్యాణ్‌ కూడా వర్మ వల్లే గెలిచాననని, నా విజయాన్ని వర్మ చేతుల్లో పెడుతున్నానన్నారు. గత ఏడాది నుంచి ఇదే జరిగింది. దీనికి భిన్నంగా జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా నాగబాబు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా వర్మను గిల్లినట్లు భావిస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ.



ehatv

ehatv

Next Story