YS Jagan : గ్రీన్‌మ్యాట్లు లేవు.. గ్రాఫిక్స్ మాయాజలం లేవు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ప్రజల్లో ఉన్న క్రేజ్ గురించి వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ప్రజల్లో ఉన్న క్రేజ్ గురించి వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటారు. ఎన్నికలకు ముందు వైసీపీ చాలా పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించింది. సిద్ధం సభల పేరుతో భారీగా ప్రజలను సేకరించి పెద్దపెద్ద సభలు ఏర్పాటు చేసింది. వైసీపీ పట్ల ఆ స్థాయిలో జనం ఆకర్షితులయ్యారని అనిపించేలా సభలు జరిగాయి. సిద్ధం సభలకు ఆస్థాయిలో జనసమీకరణ, ఆ స్థాయిలో జనాలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆ సమయంలో కూటమి నేతలు అదంతా గ్రాఫిక్స్ మాయాజాలమని.. నిజంగా వచ్చిన ప్రజలు కాదని వాదించారు. వచ్చిన జనం జగన్‌కు ఓట్లు వేశారో లేదో అనేది పక్కన పెడితే ప్రజలు అయితే పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే అప్పటి కూటమి నేతలు
నిజంగా వచ్చిన జనం కాదు.. వైసీపీ నేతలు గ్రాఫిక్స్ మాయాజలం చేస్తోంది అని వాదించారు. సాధారణంగా బహిరంగ సభలకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు. కానీ వైసీపీ సభలకు జగన్ కోసమే జనం వచ్చినట్లుగా 30-40 నియోజకవర్గాల సిద్ధం సభలకు వచ్చారు. వైసీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు జగన్‌ను హీరో వర్షిప్‌తో చూసేవారు. జగన్ పట్ల ఎట్రాక్షన్ అయ్యేవారు. అయితే ఇదంతా ఐప్యాక్ సృష్టి అని, గ్రీన్‌మ్యాట్లు వేసి ఎక్కువ మంది జనాలు వచ్చినట్లు చూపారంటున్నారు. అయితే వల్లభనేని వంశీని చూసేందుకు జగన్ విజయవాడ జైలుకు వెళ్లారు. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు వచ్చారు. జనాలను అదుపు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. జైలు పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేసి, భారీ ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసినా కానీ ప్రజలు తోసుకొని వచ్చారు. మరి ఇక్కడ గ్రాఫిక్స్ లేవు కదా.. ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
