తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ, ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నను సస్పెండ్ చేసింది.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ, ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నను సస్పెండ్ చేసింది. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కులగణనను ఆయన వ్యతిరేకించడమే ప్రధాన కారణం. కొంత మంది పెద్దలు, ప్రభుత్వంలో ఉన్న అగ్రకులాల వారు బీసీల గణనను తప్పుదారి పట్టించారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ముఖ్యంగా జానారెడ్డి లక్ష్యంగా ఆయన విమర్శలు చేశారు. బీసీ కులగణనను తప్పుల తడకగా చేశారని ఆ నివేదిక పత్రాలను తగలబెట్టాలని పిలుపునిచ్చారు. ఆ పేపర్లను చించివేశాడు తీన్మార్ మల్లన్న. రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా బీసీల కులగణన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీల జనాభా ఆధారంగా వారికి రిజర్వేషన్లు, ఫలాలు అందించాలనేది రాహుల్‌గాంధీ వాదన. రాహుల్‌గాంధీ చెప్పినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీసీ కులగణన చేపట్టింది. రాహుల్‌ డిమాండ్‌లో భాగంగానే రాష్ట్రంలో సర్వే చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ ఎమ్మెల్సీ బీసీ కులగణన పత్రాలను చించివేశాడు. ఈ నేపథ్యంలో తీన్మార్‌ మల్లన్నకు క్రమశిక్షణ కమిటీ నోటీసు ఇచ్చి వివరణ ఇవ్వాలని కోరింది. క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసును తీన్మార్ మల్లన్న లెక్క చేయలేదు. తీన్మార్ మల్లన్న నోటీసులకు సమాధానం ఇవ్వలేదని ఆయనను సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఈరోజు నిర్ణయం తీసుకుంది. ఈ అంశం కాంగ్రెస్‌కు నష్టం చేస్తుందా లేదా లాభం చేకూరుతుందా.. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!



ehatv

ehatv

Next Story