ఈరోజు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి అక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈరోజు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి అక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూసిన తర్వాత ఇదే వాదన అనిపిస్తోంది. ప్రధానంగా తెలంగాణ, ఏపీ మధ్య నీటి కేటాయింపులపై వివాదం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటి కంటే అధికంగా వాడుకుందని మాజీ ఇరిగేషన్‌ మినిస్టర్‌ హరీష్‌రావు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఏపీ తమ వాటాకు నీటిని వాడుకుందని.. తెలంగాణ వాడుకోవాల్సిన నీటిని వాడుకోలేదని హరీష్‌రావు వాదిస్తున్నారు. కేఆర్‌ఎంబీపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని ఇక్కడి రైతులకు నష్టం జరగకుండా చూడాలని ఆయన అంటున్నారు. రెండు, మూడు నెలలపాటు ఇక్కడ పంటలకు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని.. నీళ్లు వాడుకోకపోతే తెలంగాణ రైతులు నష్టపోతారనేది హరీష్‌రావు, బీఆర్‌ఎస్‌ నేతల వాదిస్తున్నారు. కౌంటర్‌గా ప్రభుత్వం నుంచి ఏం జరుగుతోంది. ఏపీ నిజంగానే నీళ్లు అధికంగా వాడుకుంటుంటే దానికి అడ్డుకట్ట వేయాలి. కానీ ప్రభుత్వం నుంచి అది కనపడలేదు, ప్రభుత్వం వైపు నుంచి ఎదురుదాడి కనపడుతోంది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు వింతగా ఉంటున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి వైఎస్‌ పోతిరెడ్డిపాడుకు అక్రమంగా నీళ్లు తీసుకెళ్తుంటే ఆ కేబినెట్‌లో ఉన్న హరీష్‌రావు ఎందుకు ప్రశ్నించలేదని రేవంత్‌ అన్నారు. కేబినెట్‌లో ఉండి ఎందుకు మాట్లాడలేదని హరీష్‌రావును, బీఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు. కేబినెట్‌లో ఉండి ఎందుకు అడగడం లేదన్న రేవంత్‌.. మరి అప్పటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి పోతిరెడ్డిపాడుకు నీళ్లు తీసుకెళ్లి తప్పు చేశారని, ఇప్పటి కాంగ్రెస్‌ ముఖ్యంత్రి అంగీకరిస్తున్నారా. ఒకవేళ అప్పటి ముఖ్యమంత్రి తప్పు చేస్తే చూస్తూ ఉన్న సోనియా, రాహుల్‌ది తప్పు కాదా. అసలు పోతిరెడ్డిపాడుకు నీటి తరలింపునకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ అప్పటి టీఆర్‌ఎస్‌ కేబినెట్‌ నుంచి వచ్చింది వాస్తవం కాదా..!ఈ అంశంపై సీనియర్ జర్నలిస్టు 'YNR' విశ్లేషణ..



Updated On 21 Feb 2025 1:01 PM GMT
ehatv

ehatv

Next Story