YS Sharmila:షర్మిలను ఉరికిచ్చి ఉరికిచ్చి తరిమికొడతారు!
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల(APPCC Chief YS Sharmila)పై ఒకప్పటి వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ(YSRTP)నాయకుడు కొండా రాఘవరెడ్డి (KondaRaghavaReddy)విరుచుకుపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల(APPCC Chief YS Sharmila)పై ఒకప్పటి వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ(YSRTP)నాయకుడు కొండా రాఘవరెడ్డి (KondaRaghavaReddy)విరుచుకుపడ్డారు. ఆమె జగన్‌పై ఇలాగే ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే వైఎస్‌ఆర్(YSR)అభిమానులు ఆమెను తరిమి తరిమి కొడతారని రాఘవరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (Ap Assembly)ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటినా ఇంకా జగన్ మీద పడి ఏడ్వడమెందుకని అన్నారు. ఎన్నికల ముందు షర్మిల ఏదేదో వాగిందని, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును మెడమీద వేసుకుని తిరిగింది, సొదరి వై.ఎస్.సునీతారెడ్డి(YS Sunitha Reddy)ని వెంటేసుకుని తిరిగింది. ఎన్ని అబద్దాలాడాలో అన్ని అబద్ధాలాడింది. తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించింది. వైఎస్‌ఆర్‌కు నిజమైన వారసురాలినిన తానేనని చెప్పింది. కొంగుజాచింది. మొసలి కన్నీరు పెట్టింది. ఇంతా చేసినా కడప లోక్‌సభ నియోజకవర్గంలో(loksabha Constituency)ఆమెకు డిపాజిట్ కూడా రాలేదు. పులివెందుల నియోజకవర్గ (Pulivendula Constituency)పరిధిలో ఆమెకు వచ్చిన ఓట్లు పాతిక వేలు. ఆమె ఎవరి మీద అయితే అభియోగాలు మోపిందో, ఎవరిని నిందితుడు అంటూ చెప్పిందో, ఎవరికి టికెట్ ఇవ్వొద్దు అంటూ మాట్లాడిందో, ఆయనకు లక్షకు పైగా మెజారిటీ వచ్చింది. ఇప్పుడైనా షర్మిలకు ఇంగిత జ్ఞానం ఉండాలిగా. నువ్వు ప్రజల ముందు పెట్టినవు. రెఫరెండం అన్నావు. నా చెల్లెకు న్యాయం చేయమని అన్నావు. నా కుటుంబానికి న్యాయం చేయమని అర్థించావు. ఇన్ని దుర్మార్గపు మాటలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేసినా కడప జిల్లా(Kadapa District) ప్రజలు ముఖ్యంగా పులివెందుల ప్రజలు షర్మిలకు బాగా బుద్ధి చెప్పారు.