ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్‌(Skill development case) స్కామ్ కేసులో ఈడీ(ED) తాజాగా సిమెన్స్‌ కంపెనీ ఆస్తులను ఆటాచ్‌ చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్‌(Skill development case) స్కామ్ కేసులో ఈడీ(ED) తాజాగా సిమెన్స్‌ కంపెనీ ఆస్తులను ఆటాచ్‌ చేసింది. ఢిల్లీ, ముంబై, పూణేలలోని సిమెన్స్ కంపెనీకి చెందిన రూ.23 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ ఎక్స్‌ ద్వారా తెలిపింది. ఓ రకంగా చంద్రబాబుకు ఈడీ షాకిచ్చినట్టే! నకిలీ ఇన్ వాయిస్‌ల ద్వారా వస్తువులు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. స్కిల్ డెవలప్మెంట్ నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు తేలింది. డీటీసీఎల్‌ ఎండీ ఖాన్వెల్కర్, సుమన్ బోస్ ముకుల చండ్ ఆస్తులను సైతం ఈడీ స్వాధీనం చేసుకుంది. స్కిల్ డెవలప్‌మెంట్‌లో స్కామ్‌ జరిగినట్టే కదా! ఈ విషయాన్ని మీడియా కవర్‌ చేసింది. ఇప్పటి వరకు గత ప్రభుత్వం చంద్రబాబుపై(chandrababu) కక్షపూరితంగా కేసు పెట్టిందని చాలా మంది అనుకున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో స్కామ్‌ జరగడానికి ఆస్కారమే లేదని తెలుగుదేశంపార్టీ చెబుతూ వచ్చింది. ఆ పార్టీ అనుకూల మీడియా కూడా అదే రకమైన వార్తలు రాసింది. ఇప్పుడు ఈడీ దూకుడు పెంచడంతో ఇందులో నిధులు దుర్వినియోగం అయ్యాయని రుజువయ్యింది. కానీ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా మాత్రం అలా అనుకోవడం లేదు. చంద్రబాబుకు ఈడీ క్లీన్‌ చీట్ ఇచ్చిందని రాసుకొచ్చాయి. తెలుగుదేశంపార్టీకి చెందిన సోషల్ మీడియా రెండు మూడు వార్త పత్రికల కటింగ్స్‌ను పెట్టుకుని చంద్రబాబుకు ఈడీ క్లీన్‌ చీట్‌(Clean chit) ఇచ్చిందని, న్యాయం గెలిచిందని రాసుకొచ్చాయి. కానీ ఈడీ ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. ఓ అధికార ప్రకటన చేయలేదు. కనీసం ఎక్స్‌లో ట్వీట్‌ కూడా చేయలేదు. మరి టీడీపీ బ్యాచ్‌కు చంద్రబాబుకు క్లీన్‌ చీట్ ఇచ్చిందని ఎలా తెలిసింది? టీడీపీ అనుకూల పత్రికల్లో వస్తే అదే ప్రామాణికమా?

Eha Tv

Eha Tv

Next Story