ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద హత్య కేసుపై రాజకీయాల్లో చర్చ చూస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద హత్య కేసుపై రాజకీయాల్లో చర్చ చూస్తున్నాం. దాదాపు 6 ఏళ్లుగా ఇదే చర్చ కొనసాగుతోంది. సరిగ్గా ఆరేళ్ల క్రితం మార్చి 14న వివేకానంద హత్య జరిగింది. హత్య ఎవరు చేశారనేదానిపై విమర్శలు, ప్రతి విమర్శలు చూస్తూనే ఉన్నాం. సిట్ 1, సిట్‌ 2, సీబీఐ విచారణ తర్వాత నిజమైన సూత్రధారులు, హంతకులు ఎవరనేది తేల్చకలేకపోయారు. ఈ దాడి చేసింది, హత్య చేసింది తానేని దస్తగిరి అనే వ్యక్తి పోలీసుల ముందు నిజాన్ని ఒప్పుకున్నాడు. దస్తగిరి అప్రూవర్‌గా మారారు. హత్య మేమే చేశాం, పలనావాళ్లు చేయమంటేనే చేశామని చెప్పాడు. దీనిని వైసీపీ నేతల ఖండించారు. హత్య వెనుక వైసీపీ నేత అవినాష్‌రెడ్డి ఉన్నారు అని చెప్పారు. టీడీపీకి సంబంధించిన మీడియా ఈ కథనాలు రాస్తోంది, మనం చూస్తూనే ఉన్నాం. సీబీఐ విచారణ తీరుపై అనుమానాలు చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు కూడా. ఈ అంశంపై రీసెర్చ్ చేసి వైర్‌ జర్నలిస్టులు చాలా కథనాలు రాశారు. వైర్ కథనాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.వైర్‌ కథనాలు అనేక మౌలికమైన ప్రశ్నలు రేకెత్తాయి. తాము వ్యక్తం చేసిన ప్రశ్నల కోణంలో కాకుండా సీబీఐ కొత్త కోణంలో విచారణ చేస్తోందనే విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా అమెజాన్‌ ప్రైంలో హత్య పేరుతో ఓ మూవీ వచ్చింది. ఈ సినిమా వివేకానంద హత్య, దర్యాప్తులో భాగంగానే వచ్చిందని భావిస్తున్నారు. అసలు ఈ సినిమాలో ఏముంది..ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!



ehatv

ehatv

Next Story