మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు, దేశంలోని వివిధ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పలు అనుమానాలకు తావిస్తోంది.

మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు, దేశంలోని వివిధ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పలు అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల సంఘం తీరుపై ఎన్నికలు జరిగిన మూడు నెలల తర్వాత కూడా చర్చ జరుగుతోంది. ఎన్నికలు జరిగి, ఓట్ల లెక్కింపు పూర్తయ్యి, కొత్త ప్రభుత్వాలు కొలువు తీరి రెండు నెలలు గడిచి, మూడో నెలలో ఎంటరైన తర్వాత కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించి, ఎన్నికల్లో జరిగిన అవకతవకల గురించి, లోపాల గురించి చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించి ఈ ఎన్నికల్లో ఏదో జరిగిందనే అనుమానం మరింతగా బలపడుతూ వస్తోంది. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తున్నదంటే ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే సాధారణంగా ఎవరికైనా ఇదే అభిప్రాయం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSR congress) నాయకులు రీ వెరిఫికేషన్ కోసమో లేదా ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా అక్కడ ఏం జరిగింది అన్న అంశానికి సంబంధించి అభ్యంతరాలు లేవనెత్తిన సందర్భంలోనూ నేరుగా ఎన్నికల సంఘం అధికారులే మీ ఫిర్యాదులను వెనక్కి తీసుకోండి, వాటి వల్ల ఉపయోగం లేదు అంటూ ఎవరైతే వెరిఫికేషన్‌ కోసం అప్లై చేశారో వారికి ఫోన్లు చేసి చెప్పారు అంటే ఎలెక్షన్‌ కమిషన్‌(ELection Commission) ఏదో తప్పు చేసిందనే భావన కచ్చితంగా కలుగుతుంది. ఆ తర్వాత ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన అధికారులు సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా రీ వెరిఫికేషన్‌ కోసం అప్లై చేస్తే తాము మాక్‌ పోలింగ్‌ మాత్రమే నిర్వహిస్తామని చెబుతూ అది మాత్రమే తమ గైడ్‌లైన్స్‌లో ఉందని చెబితే అభ్యర్థికి వచ్చిన అనుమానాలు ఎలా తీరతాయి? తమకున్న వెసులుబాటు ప్రకారం తాము చేసుకుంటూ వెళతామని ఈసీ చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రీ వెరిఫికేషన్‌ను కోరడం అభ్యర్థి హక్కు. దాన్ని కాదనే అధికారం ఎన్నికల సంఘానికి లేదు. కానీ మాక్‌ పోలింగ్‌(Polling) మాత్రమే చేస్తామని ఈసీ ఎందుకు అంటోంది? అందుకే కదా అనుమానాలు బలపడుతున్నది. ఇక్కడ మరో కీలకమైన అంశమేమిటంటే ఈవీఎంలను ట్యాంపర్‌ చేయడం సాధ్యం కాదు అని ఈసీ చెప్పడం. నిజమే ఈవీఎంలను ట్యాంపర్‌ చేయడం కుదరని పని! కానీ ఎన్నికల కమిషన్‌ మోసం చేసినట్టుగా అనిపిస్తోంది. ఆ మోసమేమిటంటే, ఎన్నికల్లో ఎంత మంది ఓట్లు వేశారో వారి ఓట్లను కాకుండా మరికొన్ని ఓట్లను కలిపి లెక్కించడం. ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల సంఘం సైట్‌లోనే ఈ విషయం ఉంది. ఎన్నికల కమిషన్‌ చీటింగ్ కారణంగా రాజకీయ పార్టీలు నష్టపోయాయి. ప్రజల అభిప్రాయం స్పష్టంగా బయటకు రాలేదనే భావన కలుగుతోంది.



Updated On 24 Aug 2024 5:22 AM GMT
Eha Tv

Eha Tv

Next Story