Journalist YNR Analysis : షర్మిల రాజకీయం టీడీపీకి ఇబ్బందిగా మారిందా?
ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన కొనసాగుతోందని, శాంతి భద్రతలు తుడిచిపెట్టుకుపోయాయని చెబుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీలో ధర్నా నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్(AP)లో అరాచక పాలన కొనసాగుతోందని, శాంతి భద్రతలు తుడిచిపెట్టుకుపోయాయని చెబుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) ఢిల్లీలో ధర్నా(Delhi Dharna) నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాంతి భద్రతలను పూర్తిగా గాలికి వదిలేసిందని ధర్నా చేశారు జగన్. ఈ ధర్నా చేసిన విధానం కంటే ఆ ధర్నా తమకు కలిగించే నష్టం కంటే , అక్కడ ధర్నా చేసి జగన్ సెల్ఫ్‌గోల్ వేసుకున్నాడని తెలుగుదేశంపార్టీ అంటోంది. తెలుగుదేశంపార్టీ(TDP) పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్‌రెడ్డి చేసుకున్న సెల్ఫ్‌గోల్ ఏమిటి అంటే, ఆ ధర్నా స్థలికి ఇండియా కూటమి(INDIA Alliance)కి చెందిన నాయకులు ఎక్కువ మంది హాజరయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్(Akhilesh Yadav)తో పాటు, తృణమూల్ కాంగ్రెస్ నేతలు, శివసేన (ఉద్దవ్ థాకరే) నాయకులు, అన్నా డీఎంకే నేతలు ఇలా దాదాపు ఎనిమిది రాజకీయ పార్టీలకు చెందిన వారు జగన్ ధర్నాకు సంఘీభావం ప్రకటించారు. వీరంతా ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా ఉన్న ఇండియా కూటమి శిబిరానికి చెందిన వారు. బీజేపీ, ఎన్టీయే వ్యతిరేక పార్టీలకు చెందిన నేతలు అక్కడికి వచ్చి సంఘీభావం తెలిపారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమికి దగ్గరవుతున్నారనే మాట వినిపించింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడొచ్చు.