ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) ఎంపీ విజయసాయిరెడ్డి(MP vijaysai Reddy) కేంద్రంగా ఓ వివాదం నడుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) ఎంపీ విజయసాయిరెడ్డి(MP vijaysai Reddy) కేంద్రంగా ఓ వివాదం నడుస్తోంది. అసలేమిటా వివాదం అంటే.. విజయసాయిరెడ్డి, మరో వ్యక్తి కలిసి తన భార్యను గర్భవతిని చేశారంటూ అమెరికాలో ఉండే మదన్‌మోహన్‌(Madanmohan) అనే వ్యక్తి ఎండోమెంట్‌ కమిషనర్‌కు ఓ లేఖ రాశారు. దీనిపై విచారణ జరపాలని, తనకు న్యాయం చేయాలని ఆ లేఖలో కోరారు. ఆ లేఖ బయటకు వచ్చింది. ఆ లేఖ తెలుగుదేశంపార్టీ మీడియాలో ప్రత్యక్షమయ్యింది. ఆ లేఖను ఆధారం చేసుకుని టీడీపీ మీడియా విజయసాయి రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయసాగింది. విజయసాయిరెడ్డి వ్యక్తిత్వ హననానికి పూనుకుంటోంది. అంతే కాదు, ఎండోమెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఉన్న శాంతి అనే మహిళకు విజయసాయిరెడ్డికి ఉన్న సంబంధం ఇది అంటూ టీడీపీ మీడియా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వస్తోంది. అయితే టీడీపీ(TDP) మీడియాకు ఈ లేఖ ఎలా లభ్యమయ్యిందన్న ప్రశ్న చాలా మందికి కలుగుతోంది. ఎండోమెంట్ కమిషనర్‌కు అమెరికాలో(america) ఉన్న మదన్‌మోహన్‌ లేఖ రాస్తే ఆ లేఖను బయటకు ఎవరు రిలీజ్‌ చేశారు? ఎందుకు రిలీజ్‌ చేశారు? ఏమి ఆశించి రిలీజ్‌ చేశారు? సరే, మీడియాకు ఇంకొకరు రిలీజ్‌ చేయాల్సిన అవసరం లేదనుకుందాం! మీడియా శోధించి సాధించిందనే అనుకుందాం! అయితే ఈ లేఖను బయటపెట్టడంలో ఉద్దేశమేమిటి? ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న వ్యక్తిగత వ్యవహారాన్ని బయటకు తీసుకువచ్చి దాన్ని ప్రపంచానికి గంటలు గంటలుగా చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఏమో వారికి ఏం ప్రయోజనాలున్నాయో తెలియదు కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఆరు నెలల పాపపై అత్యాచారం జరిగింది. అలాగే పదేళ్ల పాపపై అత్యాచారం చేశారు దుర్మార్గులు. ఆమె ఏమైందో ఇప్పటికీ తెలియదు. ఇలాంటివి నాలుగైదు సంఘటనలు జరిగాయి. నిజానికి ఈ ఘటనలే మీడియాలో ఎక్కువగా రావాలి. కానీ ఎందుకో విజయసాయి రెడ్డిపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టింది టీడీపీ మీడియా!సాయి రెడ్డి - శాంతి వివాదమేంటి ?


Updated On 16 July 2024 7:19 AM GMT
Eha Tv

Eha Tv

Next Story