సినీ నటుడు పృథ్వీ లైలా సినిమా ఫంక్షన్‌లో వైసీపీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.

సినీ నటుడు పృథ్వీ లైలా సినిమా ఫంక్షన్‌లో వైసీపీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ 151 గొర్రెలు 11గా మారాయని కామెంట్ చేశారు. ఆయన చేసిన కామెంట్ సినిమాకు ప్రమాదంగా మారింది. పృథ్వీ వ్యాఖ్యలను నోటి దురదగానే చూడాలి. సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు మాట్లాడమేంటి, పృథ్వీ జనసేన నాయకుడిగా ఉన్నారు. రాజకీయాలపై ఆయన మాట్లాడాలి అనుకుంటే ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడాలి. పైగా చిరంజీవి అటెండ్ అవుతున్న ఇలాంటి ఫంక్షన్‌లో రాజకీయాలు ఎందుకు మాట్లాడాలి. పృథ్వి కామెంట్స్ వైసీపీ నేతలు, కార్యకర్తలకు ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో లైలా సినిమాపై నెగెటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఆయన వ్యాఖ్యల పర్యవసనాలతో విశ్వక్ సేన్ సినిమాను లక్ష్యం చేసుకున్నాయి వైసీపీ శ్రేణులు. ఆ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టారు. వైసీపీ కార్యకర్తలు ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. దీంతో సినిమాకు ఎఫెక్ట్ పడనుందా.. సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
