ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో(Vijayawada) ఇటీవల వరదలు వచ్చాయన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే!

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో(Vijayawada) ఇటీవల వరదలు వచ్చాయన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే! వరదలు(Floods) తగ్గుముఖం పట్టి, సాధారణ స్థితి నెలకొని చాలా రోజులయ్యింది. ఇప్పుడు వరద సాయంపై అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతున్నాయి. వరద సాయం కోసం దాదాపు 531 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే వరద సాయం పేరుతో కోట్లాది రూపాయలను కూటమి ప్రభుత్వం కొట్టేసిందని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(COngress) ఆరోపిస్తోంది. రెండు మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో కూడా ఇందుకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. 26 కోట్ల రూపాయలు మంచినీళ్లకే ఖర్చు పెట్టామని ప్రభుత్వం చెబుతున్న మాటను వైసీపీ నాయకుడు దేవినేని అవినాశ్‌(Devineni avinash) తప్పుపట్టారు. మంచినీళ్లకు అంత సొమ్మును ఎక్కడ ఖర్చుపెట్టారని ప్రశ్నించారు. అలాగే భోజనాల కోసం 310 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టామని ప్రభుత్వం అంటోందని, అసలు భోజనాల కోసం అంత ఖర్చు ఎందుకయ్యిందో అర్థం కావడం లేదని దేవినేని అవినాశ్‌ అన్నారు. 23 కోట్ల రూపాయలు అగ్గిపెట్టెల కోసం ఖర్చు పెట్టడమేమిటని నిలదీశారు. డ్రోన్ల వినియోగానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వరద ప్రాంతాలలో తిప్పికొడితే నాలుగైదు డ్రోన్లు కూడా తిరగలేదని అవినాశ్‌ చెబుతున్నారు. అగ్గిపెట్టెలకు 23 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టడం మరీ విడ్డూరంగా ఉందని సోషల్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. భోజనాలకు 310 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పడం నవ్వు తెప్పిస్తుందన్నది ప్రతిపక్షాల మాట! అక్షయపాత్ర అనే స్వచ్చంద సంస్థ రోజుకు లక్షమందికిపైగా భోజనాలు పెట్టింది. అనేక హోటల్స్ ముందుకొచ్చి బాధితులకు భోజనాలు పెట్టాయి. మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా భోజనాలు పెట్టాయి. మరి ప్రభుత్వం 310 కోట్ల రూపాయలు ఎవరికి చెల్లించినట్టు? ఎవరికి డబ్బులిచ్చి భోజనాలు కొన్నదో ప్రభుత్వం చెప్పాలని వైసీపీ(YCP) డిమాండ్‌ చేస్తోంది.



Updated On 9 Oct 2024 10:09 AM GMT
Eha Tv

Eha Tv

Next Story