Heritage : టీటీడీ టెండర్లలో హెరిటేజ్ ఎందుకు పాల్గొనలేదు..?
టీటీడీ లడ్డూ(TTD Laddu) విషయంలో రెండు వర్గాలక సంబంధించిన మీడియా ఒకరిపై ఒకరు బురదజల్లుకుంటున్నారు కానీ ప్రజలకు వాస్తవాలు తెలియనివ్వడంలేదు
టీటీడీ లడ్డూ(TTD Laddu) విషయంలో రెండు వర్గాలక సంబంధించిన మీడియా ఒకరిపై ఒకరు బురదజల్లుకుంటున్నారు కానీ ప్రజలకు వాస్తవాలు తెలియనివ్వడంలేదు. జంతు కొవ్వు కలిగి ఉన్న నెయ్యి లడ్డూ తయారీలో వాడడం లేదని టీటీడీ ఈవో ఇచ్చిన వివరణ ప్రకారం పూర్తిగా నమ్ముతున్నాం. మార్కెట్లో ఇంత తక్కువ ధరకు నెయ్యి(Ghee) సరఫరా చేస్తున్న ఏఆర్ ఫుడ్స్(AR Foods)పై టీటీడీకి ఎందుకు అనుమానం రాలేదన్న ముఖ్యమంత్రి వాదనతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. టెండర్(Tender) పిలిచిస్తే ఎవరు తక్కువ ధరకు ఇస్తారో వారికి కాంట్రాక్ట్ ఇవ్వడం ఆనవాయితీ. ఏఆర్ ఫుడ్స్ కాకుండా మరో 4, 5 సంస్థలు కూడా టీటీడీ నెయ్యి సరఫరా చేస్తున్నాయి. గత 5 ఏళ్లలో పది సార్ల వరకు టెండర్లు పిలిచి ఉంటారు. మిగతా కంపెనీలు కూడా కిలో నెయ్యి రూ.400-450లోపు సరఫరా చేస్తున్నాయి. ఈ మిగతా కంపెనీల ట్యాంకర్లను కూడా 18 సార్లు రిజెక్ట్ చేశారు. చంద్రబాబు హాయంలో 14 సార్లు, జగన్ హయాంలో 18 సార్లు టీటీడీ తనిఖీల్లో రిజెక్ట్ చేశారు. నందినీ డెయిరీ(nandini) కూడా టీటీడీకి నెయ్యిని సప్లై చేయలేదు, రివర్స్ టెండరింగ్‌లో నందిని డెయిరీ పాల్గొనలేదు. టెండర్లో పాల్గొన్నా కానీ రివర్స్ టెండరింగ్‌లో పాల్గొనని నందిని డెయిరీకి కాంట్రాక్ట్ ఎలా కట్టబెడతారు. ఎ.ఆర్.ఫుడ్స్ అసలు నెయ్యి ఎప్పుడు సరఫరా ప్రారంభించింది..? ఎ.ఆర్.ఫుడ్స్ సంస్థ కాంట్రాక్టును ఎందుకు రద్దు చేయలేదు..? హెరిటేజ్‌కు సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా కొన్నిరాష్ట్రాల్లో నిషేధించారు. రెండు రాష్ట్రాల్లో హెరిటేజ్ ప్రముఖ బ్రాండ్.. తిరుమల శ్రీవారికి నెయ్యి సరఫరా టెండర్లలో హెరిటేజ్(Heritage) ఎందుకు పాల్గొనలేదు.. ' ఈ అంశాలపై వై.ఎన్.ఆర్.విశ్లేషణ(YNR Analysis).. ఈ వీడియోలో'..