ఆంధ్రప్రదేశ్‌లో మహిళల అక్రమ రవాణా(Women trafficking) అంశం ఎన్నికలకు ముందు పెద్ద దుమారం రేపింది

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల అక్రమ రవాణా(Women trafficking) అంశం ఎన్నికలకు ముందు పెద్ద దుమారం రేపింది. జనసేన పార్టీ(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల మందికి పైగా మహిళలు అక్రమ రవాణాకు గురయ్యారంటూ సంచలన ఆరోపణలు చేశారు. గ్రామాలలో వాలంటీర్ల(Volunteer) ద్వారా ఈ పాడు పని చేయించారని పవన్‌ అన్నారు. పైగా తనకు ఈ విషయాన్ని కేంద్ర ఇంటెలిజెన్స్‌(Union inteligence) చెప్పిందని కూడా అన్నారు. ఈ స్థాయిలో మహిళల అక్రమ రవాణా మరెక్కడా జరగడం లేదని చెప్పారు. కేంద్ర నిఘా వర్గాలు తనకు ఈ విషయం చెబుతూ ప్రజలకు ఈ విషయాన్నివివరించాలంటూ కోరాయని పవన్‌ కల్యాణ్‌ చెప్పుకొచ్చారు. తర్వాత పవన్‌తో చంద్రబాబు నాయుడు కూడా జత కలిశారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఇందుకు సంబంధించిన లెక్కలు వచ్చాయి. దాంతో పాటు క్లారిటీ కూడా వచ్చింది. గత అయిదేళ్లలో మహిళల అక్రమ రవాణా కేసులు 34 మాత్రమే నమోదుకాగా.. వీటిల్లో 46 మందిని బాధితులుగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్‌ హోం శాఖ. ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యేల ప్రశ్నకు.. గణాంకాలతో సహా అసెంబ్లీలో ప్రకటించింది. అసెంబ్లీలో బయపడిన నిజాలతో పవన్‌, చంద్రబాబు చేసిన ఆరోపణలు అబద్ధమని తేలిపోయింది. ఎప్పటిలాగే పవన్‌ కల్యాణ్‌ తెక్క తప్పింది..

Updated On 17 Nov 2024 8:00 AM GMT
Eha Tv

Eha Tv

Next Story