ప్రత్యేక తెలంగాణ(Telangana) ఆవిర్భవించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని(Capital) అవసరమయ్యింది.

ప్రత్యేక తెలంగాణ(Telangana) ఆవిర్భవించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని(Capital) అవసరమయ్యింది. 2014లో అక్కడ తెలుగుదేశంపార్టీ(TDP) అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కారు అమరావతికి శంకుస్థాపన చేసింది. ఎన్డీయేలో టీడీపీ కూడా భాగస్వామి కావడంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Narendra Modi) స్వయంగా తన చేతులతో శంకుస్థాపన చేశారు. అమరావతిని(Amaravathi) ప్రపంచంలోనే అత్యద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబునాయుడు నేతృత్వంలో అక్కడ నిర్మాణ కార్యక్రమాలు మొదలయ్యాయి. నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలోనే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చింది. నిర్మాణాలు ఆరంభ దశలో ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారింది. 2019లో వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) అధికారంలోకి వచ్చారు. ఆయన మూడు రాజధానులు ప్రస్తావన తీసుకొచ్చారు. అమరావతిని కేవలం లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌గా మాత్రమే ఉంచుతానని, కర్నూలులో హైకోర్టు(High court) ఉంటుందని, పాలనా వ్యవహారాలను విశాఖపట్నం నుంచి చేస్తామని జగన్‌ చెప్పారు. అమరావతి తమ ఎజెండా కాదన్నారు. అమరావతిని ఇలా వదిలేయకండి. అభివృద్ధి చేయండి . అక్కడ రైతులు స్వచ్చంధంగా భూములు ఇచ్చారు. వాళ్లందరిని మోసం చేసినట్టు అవుతుంది. ప్రభుత్వమే రైతులను మోసం చేస్తే ఎలా? అంటూ అమరావతికి చెందిన రైతులు ఆందోళన చేస్తూ వచ్చారు. అయిదేళ్ల పాటు అమరావతి ఉద్యమం నడిచింది. ఉద్యమ సమయంలో రైతులు కోరుకున్నదేమిటంటే అమరావతిని అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వం అధికారికంగా, లిఖిత పూర్వకంగా చెబితేనే తాము భూములు ఇచ్చామని, వైసీపీ ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టేస్తే తాము ఇచ్చిన భూములకు అర్థం పర్థం లేకుండా పోతుందని రైతులు అన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారనే ఆరోపణలు రావడం చూశాం!

రాష్ట్రం అప్పుల్లో ఉందని, ఇప్పుడున్న పరిస్థితులలో లక్ష కోట్లు పెట్టి రాజధానిని నిర్మించడం కష్టమని జగన్మోహన్‌రెడ్డి అన్నారు. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చుపెట్టడం సరైంది కాదు అని వైసీపీ చెబుతోంది. అయితే టీడీపీ వాదన మరో రకంగా ఉంది. లక్ష కోట్లు అని వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నదని అంటోంది. అసలు టీడీపీ వాదన ఏమిటో ఈ వీడియోలో చూద్దాం.


Updated On 26 Aug 2024 10:37 AM GMT
Eha Tv

Eha Tv

Next Story