వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి(YSRCP) చెందిన కొంతమంది నేతలు రకరకాల వివాదాల్లో చిక్కుకుంటున్నారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి(YSRCP) చెందిన కొంతమంది నేతలు రకరకాల వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మిగతా వివాదాల సంగతి పక్కన పెడితే లైంగిక ఆరోపణలు, లైంగికపరమైన బూతు వీడియోలతో సెన్సేషనల్‌గా మారుతున్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో కొంతమందిపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. కొంతమందికి సంబంధించిన ఫోన్‌ కాల్స్‌ ఆడియోలు బయటకు వచ్చాయి. కొంతమంది వీడియో కాల్స్‌ బయటకు వచ్చాయి. కొందరివైతే అత్యంత జుగుప్సాకరమైన వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఏ సందర్భంలో కూడా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వం వారిపైన చర్యలు తీసుకునే ప్రయత్నం చేయలేదు. పోనీ వారిపై దుష్ప్రచారం జరుగుతోందని, విపక్షాలు కుట్ర చేస్తున్నాయని కానీ చెప్పలేదు. సైలెంట్‌గా ఉండిపోయింది. వాటిని తాము చూడలేదు, వినలేదు అన్నట్టుగా వ్యవహరించింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రివర్గంలో ఉన్నవారికి సంబంధించి కూడా ఇలాంటి వీడియోలు బయటకు వచ్చాయి. తర్వాత వారిని మంత్రివర్గంలోంచి తొలగించడమో మరొటో చేసిన తర్వాత కూడా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి క్రెడిట్‌ రాలేదు. అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన కొందరు నాయకులపైన కూడా ఈ తరహా ఆరోపణలు వస్తున్నాయి. ఈ తరహా వివాదాలు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలను రంజింప చేస్తున్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాసరావు(Duvvada Srinivas), అనంతబాబులకు(Anant babu) సంబంధించిన విషయాలలో పార్టీ అధిష్టానం ఎందుకు ప్రాపర్‌గా హ్యాండిల్‌ చేయలేకపోయిందన్నదే ప్రశ్న. ఇందులో ఏదైనా కుట్ర ఉందా? లేకపోతే మీ పార్టీ నాయకులే తప్పు చేశారా? కుట్ర ఉంటే అదేమిటో చెప్పండి. మీ పార్టీ నాయకులు తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకోండి. ఇవి రెండు చేయకుండా సైలెంట్‌గా ఉండటం ద్వారా ఏం ఆశిస్తోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ? నాయకులపై చర్య తీసుకుంటే పార్టీకి నష్టం వాటిల్లుతుందని 175 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో 11 స్థానాలకు పడిపోయింది పార్టీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నది వైసీపీ భావిస్తోందా?

Eha Tv

Eha Tv

Next Story