తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఆ మాటకొస్తే దేశ వ్యాప్తంగా కూడా పార్టీల ఫిరాయింపులు అనే అంశం సర్వ సాధారణమయ్యింది.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఆ మాటకొస్తే దేశ వ్యాప్తంగా కూడా పార్టీల ఫిరాయింపులు అనే అంశం సర్వ సాధారణమయ్యింది. ఓ పార్టీ నుంచి గెలిచిన వారు మరో పార్టీలోకి వెళ్లిపోవడం అనేది చాలా సాధారణమైన ప్రక్రియగా ప్రజలందరూ భావించే పరిస్థితి వస్తోంది. గతంలో ఎవరైనా ఓ పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళితే వారు తప్పు చేసిన వారని, వారిని ఒ విలన్‌లాగా చూపించే ప్రయత్నం చేసేది మీడియా! ఇప్పుడు మాత్రం ఓ పార్టీని వదిలేసి మరో పార్టీకి వెళ్లినవారు హీరోలుగా ప్రజలు భావిస్తున్నారు. వారు వెళుతున్నప్పుడు ఉన్న పార్టీని తిడుతూ రంగు మార్చుకుంటున్నారు. ఇది మీడియాకు(Media) మసాలాగా మారిపోతూ ఉంది. కాబట్టి పార్టీ ఫిరాయింపు అన్నది తప్పుగా, అది నైతికంగా సరైంది కాదని సొసైటీ కూడా భావించలేని ఓ పరిస్థితి తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తోంది. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులకు ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కాంగ్రెస్‌(Congress) చాలా రాష్ట్రాలలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నది. తెలంగాణకు సంబందించి పార్టీ ఫిరాయింపులను బీఆర్‌ఎస్‌(BRS) ప్రొత్సహించింది. ప్రస్తుతం బాధిత పార్టీగా ఉంది. 2014 నుంచి 2019 వరకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YCP) బాధిత పార్టీగా ఉండింది. ఈ పార్టీకి సంబంధించిన 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశంపార్టీలో(TDP) చేరారు. ఇందులో కొందరు మంత్రులు కూడా అయ్యారు. 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీ బాధిత పార్టీగా ఉండింది,. ఇలా దేశంలోని అన్ని పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు బాధిత పార్టీగా ఉండి, తర్వాత అధికారంలోకి వచ్చాయి.

Updated On 8 Aug 2024 1:00 PM GMT
Eha Tv

Eha Tv

Next Story