Misleading Adani Controversy : బురద బకెట్లతో ఆ మీడియా !
అమెరికాలో(America) అదానీపైన(Adani) కేసు నమోదు వ్యవహారం భారత రాజకీయాలను(Indian Politics) కుదిపేస్తోంది.
అమెరికాలో(America) అదానీపైన(Adani) కేసు నమోదు వ్యవహారం భారత రాజకీయాలను(Indian Politics) కుదిపేస్తోంది. అదానీ కేంద్రంగా గడచిన కొద్ది రోజులుగా కాంగ్రెస్(Congress) పార్టీ తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నది. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ(BJP) ప్రభుత్వం అదానీకి ఈ దేశ వనరులను దోచిపెడుతున్నదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. కాంగ్రెస ముఖ్య నేత రాహుల్ గాంధీ అయితే అదానీపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. నరేంద్రమోదీ-అదానీ బంధం గురించి అనేక సందర్భాలలో రాహుల్‌గాంధీ మాట్లాడారు. అయితే అమెరికాలో తాజాగా అదానీతో పాటు మరో ఏడుగురిపైన కేసు నమోదయ్యింది. ఈ కేసు నమోదైన నేపథ్యంలో ఈ వ్యవహారంపైన విచారణ జరిపించాలని, తక్షణం అదానీని అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ వచ్చారు. అదానీ కేంద్రంగా దేశ వ్యాప్తంగా విమర్శలు, ప్రతి విమర్శలు చూస్తున్నాం. అదానీని బీజేపీ పెంచి పోషిస్తోందని, లేకపోతే లక్షల కోట్ల సందప పదేళ్ల కాలంలో ఎలా సంపాదించారని రాహుల్ ప్రశ్నిస్తున్నారు. దేశానికి సంబంధించిన వనరులన్నింటినీ అదానీకి కట్టబెడుతున్నారని, చివరకు ఎల్ఐసీని కూడా అదానికి అప్పగించడానికి మోదీ సిద్ధమయ్యారని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదానీ మీద పెట్టిన కేసులో ఆంధప్రదేశ్‌ను కూడా ఇరికించే ప్రయత్నం చేశారు. అప్పటి ప్రభుత్వ పెద్దలకు అదానీ భారీ ఎత్తున ముడుపులు ఇచ్చారని కొన్ని పత్రికలలో వచ్చింది. ఈ లంచాలు తీసుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన అధికారులు, రాజకీయ నేతలు కూడా ఉన్నారట! 1750 కోట్ల రూపాయలు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే(YS Jagan) ఇచ్చారని తెలుగుదేశంపార్టీ(TDP) అనుకూల మీడియా తెగ రాసింది. జగన్ ఒక దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నది. ఆ మీడియాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కంటే ఓ వ్యక్తిని టార్గెట్ చేస్తూ, పదే పదే ఆయనను కించపరచడమే కావాలి. ఆయనపై బకెట్ల కోద్దీ బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకుంది. అదే కర్తవ్యంగా భావిస్తున్నారు. ఆంధ్రపదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమిలో తెలుగుదేశం, జనసేన , భాతరీయ జనతా పార్టీలు ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఎన్డీయేలోనూ ఇవే పార్టీలు ఉన్నాయి. అదానీ కుంభకోణం చేసి ఉంటే, అదానీకి బీజేపీ బ్యాకప్ ఉందని విపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అదానీతో జగన్మోహన్‌రెడ్డి కలిసి కుట్ర పన్ని లంచాలు తీసుకున్నారని ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశంపార్టీ అనుకూల మీడియా మాట్లాడుతున్న సమయంలో ఎందుకు కూటమి నేతలు మౌనంగా ఉంటున్నారు? ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అందులో ఏపీలో ఉన్న అదానీ కంపెనీలపై, అవి చేస్తున్న అవినీతిపై ఓ తీర్మానం చేయవచ్చు. ఎవరూ అభ్యంతర పెట్టరు. ఎందుకంటే ప్రతిపక్షం డిమాండ్ కూడా ఇదే కాబ్టటి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న అయిదేళ్ల పాటు టీడీపీ అనుకూల మీడియా అదానీ జగన్ కలిసి ఏపీని దోచుకుంటున్నారని రాశాయి. గంగవరం పోర్టును అప్పనంగా అదానీకి కట్టబెట్టారని రాశాయి. ప్రజల కోసం పని చేస్తున్నామని చెప్పుకుంటూ ఓ పార్టీ కోసం పని చేస్తున్న ఓ దిన పత్రిక కూడా అదాని-జగన్ బంధం గురించి ఓ పెద్ద కథనాన్ని ప్రచురించింది. గత అయిదేళ్ల కాలంలో జగన్ - అదానీ ఒప్పందాలను బయటపెట్టే అవకాశం కూటమి నేతలకు ఉందని టీడీపీ అనుకూల మీడియా రాయొచ్చు. కానీ రాయదు. అదానీ- జగన్ కలిసి నేరం చేసినప్పుడు అదానీ మంచోడు, జగన్ చెడ్డోడు ఎలా అవుతారు?