వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YCP) అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) సరికొత్త స్ట్రాటజీని(Strategy) అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YCP) అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) సరికొత్త స్ట్రాటజీని(Strategy) అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు రెండు నెలలు అవుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్మోహన్‌రెడ్డి తన పదవీకాలంలో బయటకు వచ్చి మీడియాతో మాట్లాడని సందర్భాలు తక్కువ కానీ ఈ రెండు నెలల కాలంలో ఆయన బయటకు వచ్చారు. మీడియాతో ముచ్చటిస్తున్నారు. ప్రభుత్వంపైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి ధర్నా కూడా చేశారు. ఈ అన్ని సందర్భాలలో కూడా జగన్మోహన్‌రెడ్డి పదే పదే చెబుతున్న కొన్ని మాటలు ఆయన వ్యూహమేమిటన్నది చెబుతున్నాయి. ఆయన పదే పదే చెబుతున్న మాటలేమిటంటే రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు అక్కడ మొదటిసారిగా మాట్లాడిన మాట ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి ఉండి ఉంటే అమ్మ ఒడి పడి ఉండేది కదా!. జగన్మోహన్‌రెడ్డి ఉండి ఉంటే ఈ పాటికి ఫీజు రీఎంబర్స్‌మెంట్ జరిగి ఉండేది కదా! జగన్మోహన్‌రెడ్డి ఉండి ఉంటే,. ఇప్పటికే రైతు భరోసా డబ్బలు అకౌంట్‌లో పడి ఉండేవి కదా, జగన్మోహన్‌రెడ్డి ఉండి ఉంటే చేనేత కార్మికులకు ఆపన్నహస్తం అంది ఉండేది కదా! జగన్మోహన్‌రెడ్డి బటన్‌ను నొక్కి ఎప్పటికప్పుడు రకరకాల సందర్భాలలో రకరకాల సెక్షన్ల వాళ్లకి డబ్బులు వేస్తూ వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి లేని ఈ రెండు నెలల కాలంలో అటువంటి డబ్బుల పంపిణి ఆగిపోయిందనే చర్చ ప్రజలలో ఉంచాలన్నది జగన్మోహన్‌రెడ్డి స్ట్రాటజీగా కనిపిస్తున్నది.