YNR Analysis : డిజిటల్ మీడియా పై ఏడుపెందుకు?
డిజిటల్ మీడియా పై ఏడుపెందుకు?
ఇటీవల తెలుగు రాష్ట్రాలకు(Telugu staes) సంబంధించిన ఒక ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో జర్నలిస్టు(TV channels) మూర్తి జ్యోతిష్యము, జ్యోతిష్కుడు అన్న టాపిక్‌పై ఓ డిబేట్ నిర్వహించారు. ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి(Venu swamy) ఇటీవల సెలెబ్రిటీలకు సంబంధించి ఓ జాతకం చెప్పారు. నటుడు అక్కినేని నాగచైతన్య(Akkineni Nag chaithanya), శోభిత ధూళిపాళ్ల(shobitha dulipala) నిశ్చితార్థం సందర్భంగా వారిద్దరు విడిపోతారు అని జోస్యం చెప్పారు. ఆ జోస్యాన్ని తప్పుపడుతూ మూర్తి రెండు రోజుల పాటు ఓ ఛానెల్‌లో డిబేట్ చేశారు. వేణుస్వామి చెప్పిన ఆ జోస్యాన్ని చాలా మంది వ్యతిరేకించారు. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి వాళ్లు విడిపోతారో లేక కలిసి ఉంటారో అన్నది చెప్పాల్సిన అవసరం లేదన్నది మెజారిటీ అభిప్రాయం. అలా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని, దాన్ని బహిరంగంగా చెప్పడం ద్వారా ఆయన ఏం ఆశిస్తున్నారు అంటూ వేణుస్వామికి వ్యతిరేకంగా చాలా మంది మాట్లాడుతూ వచ్చారు. అయితే మూర్తి డిబేట్ పెట్టిన సందర్భంగా ఆ జ్యోతిష్యులకు సంబంధించి వాళ్లు గతంలో ఏం చేశారు అనేది చెప్పుకుంటూ ఆ జ్యోతిష్కులతో ఇంటర్వ్యూలు చేసిన ఛానెళ్లకు అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) ఫండింగ్ చేసింది అంటూ ఓ అలిగేషన్ చేశారు మూర్తి. జ్యోతిష్కల గురించి ఆయన ఏమైనా మాట్లాడుకోవచ్చు. వారు మాట్లాడిన అంశాల పట్ల ఆయనకు అభ్యంతరాలు ఉండవచ్చు. వాళ్లది తప్పు అయితే తప్పుపట్టవచ్చు. వాళ్లతోటి మాట్లాడవచ్చు. డిబేట్ పెట్టవచ్చు. కానీ ఆ జ్యోతిష్కులతో ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఛానెల్‌కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫండింగ్ చేసింది. ఇదిగో ఫలానా ఫలానా చోట్ల ఫండింగ్ జరిగింది అంటూ దానికి సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయంటూ మూర్తి అన్నారు. ఆ ఇద్దరు జ్యోతిష్కులతోటి EHA Tv కూడా ఇంటర్వ్యూలు చేసింది కాబట్టి EHA Tvకి కూడా అలాంటి ఫండింగ్ వచ్చిందనే ఆరోపణలు మూర్తి చేశారు కాబట్టి ఈ అంశానికి సంంధించిన కొన్ని వివరాలను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. వేణుస్వామి ఇంటర్వ్యూ కోసం ఆరు నెలలు ప్రయత్నించాం. ఆరు నెలల తర్వాత వేణుస్వామి ఇంటర్వ్యూకు ఒప్పుకున్నారు. వేణుస్వామి ఇంటర్వ్యూను ప్రొఫైల్ ఇంటర్వ్యూగా చేశాము. ఆ తర్వాత వేణుస్వామి ఇప్పటి వరకు చెప్పిన ప్రిడిక్షన్లు ఏమిటి? అనేది ఆయా ఛానెల్స్‌లో ఆయన చెప్పిన జోస్యాల తాలుకు వీడియోలను టెలికాస్ట్ చేసి, ఆ వీడియోలపైన ఆయన అభిప్రాయాలను తీసుకుంటూ ఓ పది నిమిషాలు మాత్రం తాజా రాజకీయ పరిణామాలపైన ఆయనతో మాట్లాడించాము. ఇక చార్యులు అనే మరో జ్యోతిష్కుడు ఆచార్యులతో చాలా ఇంటర్వ్యూలు చేశాము. ఇక్కడ EHA Tv గురించి చెప్పదల్చుకున్నదేమిటంటే ఈహా అనే ఒక ఫ్లాట్‌ఫామ్‌ను తీసుకురావడం వెనుక ఉద్దేశం తెలుగు రాష్ట్రాలలో అన్ని పార్టీలు, అన్ని రకాల ఐడియాలజీలు ఉన్నవాళ్లు ఒకే వేదికమీద కూర్చునే వాతావరణం లేకుండా పోయింది. అందరికి ఒక ఫ్లాట్‌ఫామ్ ఇద్దామనే సదుద్దేశంతోనే EHA Tvని ఏర్పాటు చేశాం. EHA Tvలో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాము. అన్ని పార్టీల గొంతులకు వినిపించాము. అన్ని రకాల అభిప్రాయాలను ప్రజల ముందుకు తెచ్చాం. ప్రజల గొంతుకై నిలిచాము.