Purandeshwari : పురంధేశ్వరిగారు... ఏమిటండి ఇది!
న్యాయస్థానాలు, అవి వెలువరించే తీర్పుల పట్ల ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉంటారు. కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఏదైనా వ్యాఖ్యలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు.
న్యాయస్థానాలు, అవి వెలువరించే తీర్పుల పట్ల ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉంటారు. కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఏదైనా వ్యాఖ్యలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కోర్టు తీర్పులను ఎవరైనా ప్రశ్నించవచ్చు. అయితే తీర్పులకు ఉద్దేశాలను ఆపాదించడం సరి కాదు. అది నేరమవుతుంది. తీర్పులపై తమ అభిప్రాయాలను ఎవరైనా వ్యక్తం చేయవచ్చు. భారతీయ జనతాపార్టీ(BJP) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati puandeswari) ఇలాంటి ఓ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆమె చెబుతున్నదాని ప్రకారం లడ్డూ(Tirumala laddu controversy) వివాదంలో సుప్రీంకోర్టు(Supreme court) చేసిన వ్యాఖ్యలు సమంజసంగా లేవట! తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఆమెకు ఉంటుంది. సుప్రీం వ్యాఖ్యలపై స్పందించే హక్కు కూడా ఆమెకు ఉంటుంది. సుప్రీం కోర్టు ముఖ్యమంత్రిని ఎలా ప్రశ్నిస్తుంది? ముఖ్యమంత్రిని అలా ఎలా చేస్తావు అని ఎలా నిలదీస్తుంది అంటూ ఆమె ప్రశ్నించారు. సుప్రీం కోర్టు వ్యాఖ్యలు సమంజసం కాదంటూ పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. అసలు సుప్రీం అసమంజసమైన వ్యాఖ్యలు ఎక్కడ చేసింది ? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులతో సమీక్ష జరిపిన తర్వాతే తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయాన్ని ప్రజలకు చెప్పారన్నది పురంధేశ్వరి భావన. ప్రజలకు తెలియాల్సిన విషయం కాబట్టే చంద్రబాబు చెప్పారని ఆమె అంటున్నారు. ఇందులో తప్పేముందన్నది ఆమె వాదన. అయితే చంద్రబాబు చెప్పిన మాటకు విరుద్ధంగా టీటీడీ అధికారులు, చంద్రబాబు తరఫు లాయర్ సుప్రీంకోర్టులో ఇంకో రకమైన వాదనలు చేశారు. పురంధేశ్వరి ఈ అంశాన్ని గమనించి ఉండాల్సింది. సుప్రీంకోర్టులో న్యాయవాది లూథ్రా కానీ, టీటీడీ ఈవో శ్యామలరావు కానీ చెప్పిందేమిటంటే కల్తీ జరిగినట్టు అనుమానం కలిగిన నెయ్యి టాంకర్లను వెనక్కి పంపిచేశామని, వాటిని అసలు వాడనే వాడలేదని స్పష్టం చేశారు. కల్తీ నెయ్యిని వాడలేదని మీరే చెబుతున్న క్రమంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏ రకంగా కల్తీ జరిగిందని చెప్పారు? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇది గమనించకుండా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించడం సమంజసం కాదని పురంధేశ్వరి అనడం ఆమెకే అంత మంచిది కాదు. లడ్డూలో కల్తీ జరిగిందని, లడ్డూను పాడు చేశారని చెబుతూ సిట్‌ను ఏర్పాటు చేయడమేమిటని కోర్టు ప్రశ్నించింది. అధికారులో సమీక్ష చేస్తే, నెయ్యిలో కల్తీ జరిగిందని రుజువవుతే ఇక సిట్ ఎందుకు ఏర్పాటు చేసినట్టు? బాధ్యలపై చర్య తీసుకోవాలి కదా! అని సుప్రీం అడిగింది. సుప్రీం కోర్టు వెలిబుచ్చిన సందేహాలే సామాన్యులకు కూడా కలిగాయి. కామన్‌సెన్స్ ఉన్నవారికెవరికైనా లడ్డూలో కల్తీ జరగలేని స్పష్టమవుతోంది. సుప్రీంకోర్టు సందేహాలు ధర్మబద్దమైనవే కదా! మరి పురంధేశ్వరికి అది తప్పుగా ఎలా అనిపించింది? చంద్రబాబు చేసింది కరెక్ట్, కోర్టుదే తప్పని ఆమె ఎలా చెబుతున్నారు? రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్నవారు రాజ్యాంగం ప్రకారం ప్రవర్తిస్తూ చట్టసభలు కొన్ని చట్టాలు చేసిన తర్వాత ఆ చట్టాలు ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అన్నది చూసే బాధ్యత కోర్టులకు ఉంటుంది. ఇదే సమయంలో ప్రజావ్యతిరేక చట్టాలు ఏవైనా వస్తే అలాంటి చట్టాలను సుప్రీంకోర్టు తప్పుపట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రభుత్వాలకు చురకలు అంటించిన సందర్భాలను కూడా చూశాం. రైతు చట్టాల విషయంలో ప్రభుత్వ తీరును సుప్రీం తప్పుపట్టింది. పదేళ్ల మోదీ పాలనలో చాలా సార్లు సుప్రీంకోర్టు ప్రభుత్వం తీరును ప్రశ్నించింది. ఈ పదేళ్ల కాలంలో కోర్టులు పలు సందర్భాలలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాయి. తప్పు పట్టాయి. అప్పుడెప్పుడూ బీజేపీకి చెందిన పురంధేశ్వరి కోర్టు వ్యాఖ్యలపై స్పందించలేదు. కానీ తెలుగుదేశంపార్టీకి కష్టాలు వచ్చినప్పుడు, తెలుగుదేశంపార్టీ ఇబ్బందుల్లో పడినప్పుడు, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇరకాటంలో పడినప్పుడు మాత్రం ఆమె కోర్టును ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. పురంధేశ్వరి అభిప్రాయం బీజేపీ అభిప్రాయంగా పరిగణించాలా? కేంద్ర పెద్దల అనుమతితోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారా? కేంద్రంలో ఉన్న పెద్దలు ఈ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదు? ఒక్క పురంధేశ్వరి మాత్రమే ఎందుకు సుప్రీం వ్యాఖ్యలను తప్పుపట్టారు?