జనసేన పార్టీ 12వ వసంతంలోకి అడుగుపెట్టబోతుంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆవిర్భావ సభ పిఠాపురంలో జరిగింది.

జనసేన పార్టీ 12వ వసంతంలోకి అడుగుపెట్టబోతుంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆవిర్భావ సభ పిఠాపురంలో జరిగింది. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్‌ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి పిఠాపురంలో సభ నిర్వహించారు. అయితే పిఠాపురం వేదికగా పవన్‌ ఏం చెప్పబోతున్నారు. పిఠాపురం వేదికగా పవన్‌ ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు, కార్యకర్తలకు, రాష్ట్ర ప్రజలకు పవన్ ఏం చెప్తారనేది ఆసక్తిగా మారింది. జనసేన ఫర్దర్‌ ప్లాన్ ఏంటి, వచ్చే ఏడాది ఏం చేయబోతున్నారు, జనసేన పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతుందని చూశారు. 100 శాతం స్ట్రైక్‌ రేట్‌ సాధించామని చెప్తున్నారు, నిజానికి 100 శాతం స్ట్రైక్‌ రేట్‌తో విజయం సాధించారు కూడా. అయితే పిఠాపురం వేదికగా రాజకీయంగా ఎలా వెళ్లబోతున్నారు, తమ రాజకీయపరమైన విధానాలు ఎలా ఉండబోతున్నాయి, కార్యకర్తలకు ఎలాంటి సందేశం ఇస్తారని చూస్తే ఇవేవీ పెద్దగా కనపడలేదు. పవన్‌ కల్యాణ్‌ స్పీచ్‌లో ఇవేవీ కనపడలేదు. కానీ పవన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మనం నిలబడ్డాం, తెలుగుదేశం పార్టీని నిలబెట్టాం అని పవన్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ రియాక్షన్‌ ఏంటి.. సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..



ehatv

ehatv

Next Story