తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఇరకాటంలో పడేసింది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth reddy) తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును(Chandrababu) ఇరకాటంలో పడేసింది. తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలపైన సర్కారు దృష్టి సారించింది. ఆక్రమణలను చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. ప్రధానంగా చెరువుల ఆక్రమణ, నాలాల ఆక్రమణలను వదిలిపెట్టడం లేదు. ఇలాంటివి సహించబోమని స్పష్టం చేస్తోంది. హైడ్రా(HYDRA) పేరుతో ఆక్రమణలపై చర్యలు తీసుకునే కార్యక్రమాన్ని చేపట్టింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమ నిర్మాణాలను కూల్చివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు హైడ్రా పేరుతో జరగుతున్న కూల్చివేతలన్నీ కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జరిగాయి. ఇక ముందు కూడా అలాగే జరుగుతాయి. హైడ్రాకు అలాంటి పవర్స్‌ను ప్రభుత్వం ఇచ్చింది. అక్రమ నిర్మాణం అయితే కనుక, చెరువులో కుంటలో ఆక్రమించి కట్టినవి అయితే కనుక ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే కూల్చివేసే పవర్స్‌ను హైడ్రాకు ఇచ్చామంటూ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ హైడ్రా పేరుతో జరుగుతున్న కూల్చివేతలు కొంతమందిని లక్ష్యంగా పెట్టుకుని జరుగుతున్నాయని, ఎవరినో పొలిటికల్‌గా టార్గెట్ చేయడం కోసం హైడ్రా పేరుతో కూల్చివేతలు చేస్తున్నారంటూ చర్చ జరుగుతోంది. ప్రధానంగా బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు(KTR) సంబంధించిన ఫామ్‌ హౌజ్‌ టార్గెట్‌గా, ఫామ్‌ హౌజ్‌ను కూల్చివేయడం కోసం ముందు ప్రిపరేషన్‌లో భాగంగా కొన్నింటిని కూల్చివేస్తున్నారనే టాక్‌ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రేపో మాపో జన్వాడా ఫామ్‌ హౌజ్‌ను కూల్చేస్తారంటూ వార్తలు వచ్చినందుకు ముందు జాగ్రత్తగా కోర్టుకు వెళ్లారు ఆ ఫామ్‌ హౌజ్‌ ఓనర్‌ ప్రదీప్‌రెడ్డి(Pradeep reddy). ఆ వివాదం అలా నడుస్తున్న క్రమంలో రాజకీయాలకు, ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని అక్కినేని నాగార్జునకు(Akkineni Nagarjuna) సంబంధించిన ఎన్‌ -కన్వేన్షన్‌ సెంటర్‌ను కొద్ది గంటల వ్యవధిలోనే హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా , కోర్టులో కేసు నడుస్తున్నా వాటిని పట్టించుకోకుండా హైడ్రా అధికారులు రెండు మూడు గంటల్లోనే మొత్తం ఎన్‌ -కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేశారు. ఇది ఇలా ఉంటే, చంద్రబాబు నాయుడుకు ఈ కూల్చివేతతో సంబంధం ఏమిటి? చంద్రబాబు ఎందుకు డిఫెన్స్‌లో పడ్డారు? అన్నది ఈ వీడియోలో చూద్దాం.


Eha Tv

Eha Tv

Next Story