వైఎస్‌ఆర్(YSRCP) కాంగ్రెస్‌పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి(YS jagna) ఢిల్లీకి(Delhi) వెళుతున్నారు
వైఎస్‌ఆర్(YSRCP) కాంగ్రెస్‌పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి(YS jagna) ఢిల్లీకి(Delhi) వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి(TDP alliance) అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలను ఢిల్లీ దృష్టికి తీసుకెళ్లాలని జగన్ అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి చెందిన 30 మందికి పైగా కార్యకర్తలను హత్య చేశారు. 35 మంది కార్యకర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. వేలాది మంది కార్యకర్తలు ప్రాణభయంతో ఊరు వదిలి వెళ్లిపోయారు. పట్టపగలు అందరి ముందు హత్యలు జరుగుతున్నా వారి మీద కేసులు పెట్టడం లేదు. అదే సమయంలో అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వమే రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నదని, హింసాత్మక ఘటనలను ప్రేరేపిస్తున్నదని జగన్ ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల జరిగిన హత్యాకాండల విజువల్స్ చూసిన తర్వాత, ఆ హత్యలపై ప్రభుత్వం తీరు చూసిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తున్నదన్న అనుమానం కలుగుతోందంటూ వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ఢిల్లీలో జగన్ ధర్నా చేయడంతో పాటు కేంద్ర పెద్దలను కూడా కలుసుకుంటారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra modi) అపాయింట్మెంట్ అడిగినట్టు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్‌ను కూడా అడుగుతానని జగన్మోహన్‌రెడ్డి చెప్పారు.