దేశ వ్యాప్తంగా ఎన్నికల సంఘం(ELection Commission) మౌనం పాటిస్తోంది.

దేశ వ్యాప్తంగా ఎన్నికల సంఘం(ELection Commission) మౌనం పాటిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల(EVM) అంశానికి సంబంధించి రకరకాల అపోహలు, అనుమానాలు, ఆందోళనలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాల్సింది పోయి మౌనంగా ఉంటోంది. రకరకాల సందర్భాలలో రాజకీయపార్టీలు(Political parties) వ్యూహాత్మక మౌనం పాటిస్తాయి కానీ ఎన్నికల సంఘం మౌనం మాత్రం అనుమానాస్పదంగా ఉంది. ఈ మౌనం వెనుక కారణమేమిటో ఎన్నికల సంఘం చెబితేనే బాగుంటుంది. కానీ అది మాత్రం పెదవి విప్పడం లేదు. దేశ వ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు ఈవీఎంల తీరు గురించి గతంలో అనేక సందర్భాలలో మాట్లాడాయి. ఈవీఎంలను ట్యాంపర్‌ చేశారని కొందరు అనుమానం వ్యక్తం చేశారు కూడా! కానీ మొట్టమొదటిసారి అంటే 2024లో ఈవీఎంలపై పూర్తి ఆధారాలతో రాజకీయ పార్టీలు ముందుకొచ్చాయి. మొన్నటి ఎన్నికల ఫలితాలపై వివిధ స్వచ్ఛంధ సంస్థలకు కూడా అనుమానాలు కలిగాయి. గతంలో ఎప్పుడూ ఈ స్థాయి ఆధారాలతో రాజకీయపార్టీలు మాట్లాడలేదు. భారతదేశంలో ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే లెక్కపెట్టిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమో ఎవరికీ తెలియదు. ఇలా పోలైన ఓట్లకు, కౌంట్‌ అయిన ఓట్ల మధ్య ఎక్కువ వ్యత్యాసం ఉన్న రాష్ట్రం ఉందంటే అది ఆంధ్రప్రదేశే! దాదాపు 12 శాతం ఓట్ల తేడా కనిపిస్తోంది. ఎలెక్షన్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఉన్న విషయమే ఇది! ఎన్నికల సంఘం చెప్పిన అంకెలు చిత్రంగా ఉన్నాయి. ఎక్కడా ట్యాలీ అవ్వడం లేదు. ఈవీఎంలో ఏదో మతలబు ఉన్నదనే విషయాన్ని ప్రతిపక్షాలే కాదు, ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులే కాదు, పాలక పక్షం బీజేపీకి చెందిన వారు కూడా సందేహపడుతున్నారు. అరకు లోక్‌సభ నుంచి నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన కొత్తపల్లి గీత కూడా ఎన్నికల కౌంటింగ్‌ అప్పుడే ఏదో తేడా జరిగిందని వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గంలోనే పోలైన ఓట్లకు, కౌంట్‌ అయిన ఓట్లకు చాలా తేడా ఉందని చెప్పారు. వపర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్ ఇచ్చి మరీ చెప్పారామె! ఇలా చాలా మందికి చాలా చాలా అభ్యంతరాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఏ రాష్ట్రంలో ఏం జరిగిందనే విషయాన్ని ఉదాహరణలతో సహా ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పింది. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం.


Updated On 24 Aug 2024 5:19 AM GMT
Eha Tv

Eha Tv

Next Story