ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ తప్పటడుగు వేశారా అని అనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ తప్పటడుగు వేశారా అని అనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాంగ్‌స్టెప్పులు వేస్తూ వస్తున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పవన్‌ కల్యాణ్‌ జగన్‌ ప్రభుత్వంపై భయంకరమైన ఆరోపణలు చేశారు. గత అయిదేళ్ల కాలంలో పవన్‌ ఎన్నో ఆరోపణలు చేశారు. అందులో అత్యంత ప్రధానమైన ఆరోపణ మిస్సింగ్‌ కేసులు. ఆంధ్రప్రదేశ్‌లో చాలా పెద్ద ఎత్తున మహిళలు కనిపించకుండా పోతున్నారని, ఈ మిస్సింగ్‌ల వెనుక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ హస్తం ఉందని, ఇందులో వాలంటీర్ల హ్యాండ్‌ ఉందని ఆరోపించారు పవన్‌. పైగా తనకు ఈ సమాచారాన్ని కేంద్ర నిఘా వర్గాలు అందించాయన్నారు. పైగా కేంద్ర నిఘా వర్గాలు ఈ సమాచారం అందిస్తూ ప్రజలకు ఇది చెప్పండి అని పవన్‌ను అడిగాయట! ఈ ఆరోపణలు విన్న వారంతా నవ్వుకున్నారు. పవన్‌ ఎందుకిలా మాట్లాడారు అని అనుకున్నారు. తర్వాత పవన్‌ తను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి లెక్కలు తేలుస్తామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్‌ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు ఏమి తేలింది.? ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం వైసీపీ హయాంలో మిస్సింగ్‌ కేసుల సంఖ్య మూడు నుంచి నాలుగు వేలు మాత్రమే! ప్రస్తుత కూటమి సర్కారు అధికారికంగా చెబుతున్న నంబర్ ఇది! గతంలో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ పరమైన విమర్శలు మాత్రమేనని తేలిపోయింది. ఆయన ప్రజలలో పలుచన అయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్‌ మెచ్యూర్డ్‌గా బిహేవ్‌ చేస్తున్నట్టు కనిపించింది. రాజకీయపరమైన అంశాలలో ఆయన వ్యూహాత్మక మౌనాన్ని పాటించారు. విజయవాడ వరదల అంశానికి సంబంధించి కావచ్చు, ఏపీలో గొడవల విషయం కావచ్చు ఇంకా చాలా అంశాలలో, తెలుగుదేశం పార్టీని వైసీసీ టార్గెట్ చేస్తున్న సమయంలో కూడా పవన్‌ సైలెంట్‌గా ఉండిపోయారు.

Eha Tv

Eha Tv

Next Story