ఎన్నికల ఫలితాలు(Election results) వెలువడిన తర్వాత అధికారం కోల్పోయిన రాజకీయపార్టీలు చాలా సందర్భాలలో హుందాగా వ్యవహరించడం మనం చూశాం!

ఎన్నికల ఫలితాలు(Election results) వెలువడిన తర్వాత అధికారం కోల్పోయిన రాజకీయపార్టీలు చాలా సందర్భాలలో హుందాగా వ్యవహరించడం మనం చూశాం! ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని చెబుతుంటాయి. ఓటమి గల కారణాలను విశ్లేషించుకుంటామని, సమీక్ష జరుపుకుంటామని అంటుంటాయి. కానీ స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారి ఓ పార్టీ ఈ ఎన్నికల ఫలితాలను నమ్మబోమంటూ చెబుతోంది. ఎన్నికల ఫలితాలు సరైనవి కావని అంటోంది. ఈ మాట అంటున్నది 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ(Congress)! ఆ పార్టీకి చెందిన ప్రధాన కార్యదర్శి, ఎంపీ జైరామ్‌ రమేశ్‌(MP Jairam ramesh) ఈ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జైరామ్‌ రమేశ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారంటూ ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘానికి లేఖ పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిజానికి ఈ దేశంలో ఈవీఎంల వాడకం తర్వాత ఆ ఓటింగ్‌ మిషన్లపై ప్రజలలో అనేక అనుమానాలు కలిగాయి. సుమారు పాతిక సంవత్సరాల నుంచి మనం ఈవీఎం వాడకం ఎక్కువయ్యింది. అక్షరాస్యత లేనివారికి ఈవీఎంలపై అవగాహన అంతంత మాత్రంగానే ఉంటుంది. ట్యాంపర్‌ జరిగే అవకాశం ఉందని, సిబ్బంది ఓట్లను హైజాక్‌ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వాలే ఈవీఎంలను మార్చేసుకుంటున్నాయని, తమకు నచ్చినట్టుగా ఓట్లు వేయించుకుంటున్నాయని అంటున్నారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఇదే మాట అన్నారు. తెలంగాణలో 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఇలాగే రెస్పాండ్‌ అయ్యింది. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మహాకూటమి ఓడిపోయినప్పుడు కేసీఆర్‌ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంపార్టీ ఓడిపోయిప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఈవీఎంలపైనే నింద వేశారు. ఈవీఎంలను ఎలా ట్యాంపర్‌ చేయవచ్చో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మరీ చెప్పారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దారుణంగా ఓడిపోయింది. వైసీపీ ఈ స్థాయిలో ఓడిపోయే పరిస్థితి గ్రౌండ్‌లో లేదు. ఈవీఎంలను ట్యాంపర్‌ చేయడం ద్వారా మాత్రమే కూటమి గెలిచిందని వైసీపీకి చెందిన కొందరు నాయకులు ఆరోపించారు. జగన్‌ కూడా ఈవీఎంలను అన్నారు. వైసీపీకి చెందిన బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి ఎన్నికల సంఘాన్ని రీ వెరిఫికేషన్‌ కోసం అడిగారు. ఈసీ ఎలాంటి జవాబు ఇవ్వలేదు. ఇప్పుడు బాలినేని జనసేనలో చేరారనుకోండి. అభ్యర్థులకు ఏదైనా అనుమానాలుంటే ఎన్నికల సంఘం వాటిన నివృత్తి చేయాలి. కానీ ఈసీ మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు హర్యానా ఎన్నికల ఫలితాలు ఈవీఎంలపై అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా గెలుస్తుందనుకున్న నియోజకవర్గాలలో ఈవీఎంల బ్యాటరీ 90 శాతం చార్జింగ్‌ ఉంది. ఆయా చోట్ల బీజేపీ గెలిచింది. 60 నుంచి 70 శాతం బ్యాటరీ ఛార్జింగ్‌ ఉన్న నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ గెలిచింది. దీని వెనుక ఏదో జరిగిందని, ఏదీ జరగకపోతే బీజేపీకి అన్ని సీట్లు ఎలా వస్తాయని సామాన్యుడు సందేహపడుతున్నాడు.



Updated On 9 Oct 2024 11:41 AM GMT
Eha Tv

Eha Tv

Next Story