ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజధాని అమరావతి(Amaravati) మునిగిపోయింది..?
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజధాని అమరావతి(Amaravati) మునిగిపోయింది, అమరావతిలో పెద్ద ఎత్తున నీరు చేరిందని, ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణం సాధ్యం కాదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి(YSR congress) చెందిన సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. అమరావతి నదీ పరివాహక ప్రాంతంలో ఉందని, ఎప్పుడైనా అది మునిగిపోవచ్చని , అక్కడ ప్రజలు నివసించడం కష్టమని, కార్యాలయాలకు కూడా అనువు కాదని అంటున్నారు. రాజధానికి పనికిరాదనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడొచ్చిన వరదల సందర్భంగా హైకోర్టు మునిగిపోయిందని కొన్ని ఫోటోలతో ప్రచారం చేస్తూ వచ్చారు. కొన్ని ఛానెళ్లు ప్రసారం కూడా చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) నివాసం మునిగిపోయిందని కూడా చెప్పారు. అయితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారమేమిటి? అందులో నిజానిజాలేమిటి? అన్నదానిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందిస్తూ వస్తున్నది. తెలుగుదేశంపార్టీ సోషల్ మీడియా కూడా ఇలాంటి కథనాలకు కౌంటర్లు ఇస్తూ వస్తున్నది. అయితే అమరావతి అంశానికి సంబంధించి ఎందుకు ఫ్యాక్ట్ చెక్ చేయడం లేదు? అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయన్న ప్రచారం విస్తృతంగా జరుగుతుంటే, ప్రభుత్వంగా బాధ్యత తీసుకుని అమరావతి కోర్ ఏరియా ఏమిటి? ఆ ఏరియాలో నీళ్లు వచ్చాయా లేదా? అని ఎందుకు ప్రభుత్వం వాస్తవాలను బయటపెట్టలేకపోతున్నది? ఇప్పుడు వదర నీరు తగ్గు ముఖం పట్టి ఉంటుంది. కనీసం ఇప్పుడైనా ఆ ప్రాంతానికి సంబంధించిన దృశ్యాలు బయటపెట్టవచ్చు కదా అన్నది సామాన్యుడు ప్రశ్న! మరి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందన్నది ఈ వీడియోలో చూద్దాం.