రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) దేశ ప్రజలను అశ్చర్యపరిచాయి.

రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) దేశ ప్రజలను అశ్చర్యపరిచాయి. జమ్మూకశ్మీర్‌(Jammu kashmir), హర్యానా అసెంబ్లీ ఎన్నికల(Haryana assembly elections) ఫలితాలు వచ్చాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచే ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపై సర్వత్రా ఆసక్తి పెరిగాయి. సర్వే ఏజెన్సీలు సర్వేలు చేశాయి. మీడియా ఛానెళ్లు ఎగ్జిట్‌పోల్స్‌ను కండక్ట్‌ చేశాయి. జమ్మూ కశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌- కాంగ్రెస్‌(congress) కూటమికి అడ్వాంటేజ్‌ ఉందని సర్వే సంస్థలు చెప్పాయి. కొన్ని సంస్థలేమో హంగ్‌ వచ్చే అవకాశం ఉందని అన్నాయి. ఓవరాల్‌గా బీజేపీ కంటే నేషనల్‌ కాన్ఫరెన్స్‌-కాంగ్రెస్‌ కూటమి కాసింత ఆధిక్యత కనబరుస్తుందనే నిర్ణయానికి వచ్చాయి. హర్యానా విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్‌ ఓడిపోతుందని ఏ సర్వే ఏజెన్సీ చెప్పలేదు. ఏ ఎగ్జిట్‌పోల్స్‌లో నిర్ధారణ కాలేదు. భారతీయ జనతాపార్టీ అనుకూల మీడియా కూడా హర్యానాలో కాంగ్రెస్‌ ఘన విజయం సాధిస్తుందని చెప్పాయి. బీజేపీ అక్కడ ఘోరంగా దెబ్బతింటుందని అన్నాయి. అందుకు తగు కారణాలను కూడా విశ్లేషించాయి. కానీ ఫలితాలు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పినదానికి భిన్నమైన ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు వెళ్లింది. లోక్‌సభ ఎన్నికలలో కలిసి పోటీ చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీని దూరం పెట్టింది. ఆప్‌ను కాంగ్రెస్‌ దూరం పెట్టిందో, కాంగ్రెస్‌తో జత కలవడానికి ఆప్‌ ఇష్టపడలేదో తెలియదు కానీ ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. అయితే ఈ ఎన్నికలలో ప్రజల నాడిని పట్టుకోవడంలో సర్వే సంస్థలన్నీ దారుణంగా విఫలం చెందాయి. ఎగ్జిట్‌పోల్స్‌ అన్ని సమయాలలో కరెక్ట్‌ అవుతుందన్న గ్యారంటీ ఏమీ లేదు. చాలా సందర్భాలలో ఎగ్జిట్‌పోల్స్‌ కంటే భిన్నమైన ఫలితాలు వచ్చాయి. కాకపోతే ఒకటో రెండో సంస్థలు ప్రజల మూడ్‌ను పసిగట్టడంలో సక్సెస్‌ అవుతుంటాయి. ప్రజల అభిప్రాయాలను సరిగ్గా అంచనా వేస్తున్నాయి. హర్యానా విషయంలో ఎందుకు ఫెయిలయ్యాయన్నది చాలా మంది ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఇది భయంకరమైన షాక్‌గానే చూడాలి. మూడు నెలల కిందట ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని కొన్ని సంస్థలు బల్లగుద్దీ మరీ చెప్పాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుందని కొన్ని సర్వే సంస్థలు తెలిపాయి. ఏ సర్వే సంస్థ ఏం చెప్పినప్పటికీ ఆయా పార్టీలకు వచ్చే సీట్ల సంఖ్య వంద, నూట పది, నూట ఇరవై అని చెబుతూ వచ్చాయి. గెలిచే పార్టీకి 120 స్థానాలకు మించి రావన్నది సర్వే సంస్థల అంచనా! అయితే కేకే సర్వే ఒక్కటే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి 160కి పైగా స్థానాలలో విజయం సాధించబోతున్నది చెప్పింది. అప్పుడు కేకే సర్వే చెప్పిన దాన్ని ఎవరూ నమ్మలేదు. పైగా నవ్వుకున్నారు కూడా! ఆ స్థాయి ఫలితాలు ఉండవనే అందరూ అనుకున్నారు. ఒకవేళ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయినా మార్జిన్‌ తక్కువగానే ఉంటుందని భావించారు. కానీ కేకే సర్వే మాత్రం కూటమి 160 స్థానాలకు పైగా గెల్చుకుంటుందని చెప్పింది. దాదాపు 60 శాతం ఓట్లు కూటమికి రాబోతున్నాయని కూడా తెలిపింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే కేకే సర్వే(KK Survey) చెప్పింది పొల్లుపోకుండా నిజమయ్యింది. 164 స్థానాలలో కూటమి అభ్యర్థలు విజయం సాధించారు. ఏదిఏమైనా కేకే సర్వే చెప్పినదాని కంటే కూటమి ఎక్కువ సీట్లనే గెల్చుకోగలిగింది, కేకే చేసిన సర్వేపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఆ సంస్థకు సర్వే చేసేంత నెట్‌వర్క్‌ ఉందా? ఎవరు సర్వే చేయించారు? దీని వెనుక ఎవరున్నారు? వంటి ప్రశ్నలను కూడా లేవనెత్తారు. అలాంటి కేకే సంస్థ హర్యానా విషయానికి వచ్చేసరికి తుస్సుమంది. దారుణంగా ఫెయిలయ్యింది. 65 స్థానాలలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని కేకే సర్వే హెడ్‌ చెప్పారు. ఫలితాలు మాత్రం అలా రాలేదు. బీజేపీ మూడోసారి అక్కడ అధికారంలోకి వచ్చింది.


Updated On 9 Oct 2024 6:03 AM GMT
Eha Tv

Eha Tv

Next Story