AP Debts : ఏపీలో అప్పుల తవ్వకాలు జరుగుతున్నాయి!
ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల(AP Debts) అంశంపై రాజకీయ వివాదం(Political debate) నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల(AP Debts) అంశంపై రాజకీయ వివాదం(Political debate) నడుస్తోంది. మొన్నటికి మొన్న అసెంబ్లీలో రాష్ట్ర అప్పుపై ఓ క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ అప్పు ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు అని చెప్పింది. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రుణం అంతేనని తెలిపింది. చంద్రబాబు(Chandrababu) సీఎంగా 2014-2019 సమయంలో చేసిన అప్పును కూడా కలుపుకుంటే ఇంతే! కానీ ఎన్నికల ముందు కూటమి నేతలు ఏపీ అప్పుపై ఇష్టం వచ్చిన అంకెలు చెబుతూ పోయారు. ఒకరు పది లక్షల కోట్లు అంటే, మరొకరు 12 లక్షల కోట్లు అన్నారు. ఇంకొకరు ఇంకాస్త ముందుకెళ్లి ఏకంగా జగన్ 14లక్షల కోట్ల రూపాయల అప్పు చేశాడని నిరాధారమైన ఆరోపణలు చేశారు. తెలుగుదేశంపార్టీ(TDP) అనుకూల మీడియా కూడా ఇదే రాస్తూ వచ్చింది. తెలుగుదేశంపార్టీకి చెందిన వారు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను(YSRCP) వ్యతిరేకిస్తున్నవారు అప్పుపై కేంద్ర పెద్దలకు కంప్లయింట్ కూడా చేశారు. పార్లమెంట్‌లో వివరణ కోరారు. అయితే నిండు సభలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala sitaraman) కూడా అరేడు లక్షల కోట్ల రూపాయలేనని తెలిపారు.ఇంతకీ ఏది కరెక్ట్? కూటమి నేతలు చెబుతున్నట్టు 12 లక్షల కోట్ల రూపాయలా? లేక కేంద్రం, మొన్నఅసెంబ్లీలో పయ్యావుల కేశవ్ చెప్పినట్టుగా ఆరున్నర లక్షల కోట్ల రూపాయలా? అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాష్ట్రం అప్పుడు 9 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పారు. అందుకు సంబంధించిన లెక్కలు కూడా చెప్పుకొచ్చారు. నిజంగానే చంద్రబాబు చెబుతున్నది నిజమేనా? అసలు చంద్రబాబు అప్పుల లెక్కలను ఎలా చెప్పుకొచ్చారు? అన్నది ఈ వీడియోలో చూద్దం.