ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ(TDP) నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ(TDP) నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి కొలువుదీరిన తర్వాత క్యాబినెట్(AP cabinet) విస్తరణ కూడా జరిగింది. పదవుల పంపకం జరగాల్సి ఉంది. నామినేటెడ్ పదవుల అంశానికి సంబంధించి కూడా కూటమిలో ఓ రెష్య్యూ పెట్టుకున్నారు. ఆ నిష్ఫత్తి ప్రకారం కూటమిలోని మూడు పార్టీలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతాపార్టీలు(BJP) నామినేటెడ్ పోస్టులను పంచుకుంటాయి. ఎవరికి ఎన్ని పదవులు దొరుకుతాయన్నదానిపై స్పష్టత లేదు. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్సర్‌సైజ్ ఇంకా జరగలేదు. కూటమి ప్రభుత్వం కానీ, దానికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబునాయుడు(Chandrababu) కూడా ఆ పనిలో ఉన్నట్టుగా కూడా కనిపించడం లేదు. అయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) అధికారంలో ఉన్న సమయంలో ఆయన విపరీతంగా నామినేటెడ్ పోస్టులను సృష్టించారు. నామినేటెడ్ పోస్టులలో ఓ 70 వరకు కార్పొరేషన్‌లలో ఉంటాయి. ప్రభుత్వ సలహాదారులు ఉంటారు, మార్కెట్ కమిటీలు ఉన్నాయి. దేవస్థానాల బోర్డులు ఉంటాయి. ఇలా రకరకాలుగా నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని అడిషనల్‌గా దాదాపు అయిదువేల నామినేటెడ్ పోస్టులను జగన్ క్రియేట్ చేశారు. 54కు పైగా బీసీలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారు. నామినేటెడ్ పోస్టులను పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు. ప్రభుత్వ సలహాదారుల పోస్టులు కూడా పెద్దవే ! గత ప్రభుత్వంలో 40మందికి పైగా సలహాదారులు ఉన్నారు. కేబినెట్‌లో పాతిక మంది ఉంటే సలహాదారులు 40 మందికి పైగా ఉన్నారు. వీరికి కూడా క్యాబినెట్ హోదా ఉంటుంది. రకరకాల అంశాలకు సంబంధించి ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులను పెట్టుకోవడం చాన్నాళ్లుగా ఉంటోంది.