విశాఖపట్నం(Vizag) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) పేరును వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) ప్రకటించింది.

విశాఖపట్నం(Vizag) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) పేరును వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) ప్రకటించింది. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వంశీకృష్ణ యాదవ్‌(vamsi krishna yadav) గతంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి విజయం సాధించారు. ఎన్నికలకు ముందు ఆయన జనసేన పార్టీలో(Janasena) చేరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. దాంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఆ స్థానం నుంచి పోటీ చేయడానికి విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన చాలా మంది నేతలు ఆసక్తి కనబరిచారు. ఎందుకంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థలలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. ఇప్పుడు కూటమికి సంబంధించిన నేతలు మొత్తం ఉమ్మడి విశాఖపట్నం క్లీన్‌ స్వీప్‌ చేసినప్పటికీ ఆ ఎమ్మెల్యేల ఎక్స్‌ ఆఫీషియో నంబర్స్‌తో కలిపితే కూడా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కంటే కూటమి చాలా వెనుకబడి ఉంది. అక్కడ 841 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఉంటే 615 మంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. కూటమికి కేవలం 215 మంది ప్రతినిధులే ఉన్నారు. అంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు నాలుగు వందల ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈ లెక్కన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి సునాయాస విజయం లభించే ఛాన్స్‌ ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా పార్టీలు మారుతున్నారు. ఇప్పటికే విశాఖపట్నం నగరానికి సంబంధించి కొంత మంది కార్పొరేటర్లు పార్టీ మారారు. కొంతమంది మారడానికి సిద్ధంగా ఉన్నారని వినికిడి. పార్టీ మారతారనుకునేవారిని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి పిలిపించుకుని వారిని బుజ్జగించినట్టు చెబుతున్నారు. అయితే స్థానికంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా ఉన్నవారు కూడా పార్టీలు మారే పరిస్థితి ఉంటుంది. మున్సిపల్ కౌన్సిలర్లుగా ఉన్నవారు కూడా ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది కాబట్టి వారు కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడైతే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. అయితే విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసిన బొత్స ఝాన్సీ పేరు ముందుగా వినిపించింది. ఆమెను ఎమ్మెల్సీ బరిలో దింపొచ్చు అన్న ప్రచారం జరిగింది. అలాగే మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఆయన గాజువాక నుంచి పోటీ చేసి ప్రత్యర్థి చేతిలో భారీ తేడాతో ఓడిపోయారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేరు కూడా వినిపించింది. అలాగే మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పేరు కూడా ఈ స్థానానికి సంబంధించి ప్రచారంలో ఉంది. అయితే వైసీపీ అధిష్టానం బొత్స సత్యనారాయణను బరిలో దింపాలనే అనూహ్య నిర్ణయం తీసుకుంది. దీని వెనుక కారణమేమిటో ఈ వీడియోలో చూద్దాం.

Eha Tv

Eha Tv

Next Story