YS Sharmila : షర్మిలమ్మ అడ్డంగా బుక్కయ్యారా?
వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan)-వై.ఎస్.షర్మిలా రెడ్డి(YS sharmila) మధ్య ఆస్తుల గొడవ(Property disputes) విషయం చర్చనీయాంశంగా మారింది.
వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan)-వై.ఎస్.షర్మిలా రెడ్డి(YS sharmila) మధ్య ఆస్తుల గొడవ(Property disputes) విషయం చర్చనీయాంశంగా మారింది. 2009లో వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి(YS rajashekar reddy) హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ మరణవార్త విని తట్టుకోలేక వైఎస్ అభిమానులు కొందరు చనిపోయారు. బాధిత కుటుంబాలను ఓదర్చడానికి జగన్మోహన్‌రెడ్డి సంకల్పించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఓదార్పు యాత్రకు ఒప్పుకోలేదు. ఆ కారణంగా జగన్ కాంగ్రెస్‌ను వదిలిపెట్టేసి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. కాంగ్రెస్‌ను వదిలేశారనో, మరో పార్టీ పెట్టుకున్నారనో తెలియదు కానీ జగన్‌పై సడన్‌గా సీబీఐ(CBI), ఈడీ(ED) కేసులు పడ్డాయి. జగన్‌కు అక్రమాస్తులు ఉన్నాయింటూ అప్పుడు మంత్రిగా ఉన్న శంకర్‌రావు హైకోర్టులో పిటిషన్ వేస్తే, హైకోర్టు దాన్ని సుమోటోగా తీసుకుని దానిపైన విచారణ చేసింది. తర్వాత సీబీఐ, ఈడీలు రంగంలోకి దిగాయి. టీడీపీ నేతలు కూడా ఈ కేసుకు సంబంధించి ఇంప్లీడ్ అయ్యారు. జగన్ 16 నెలల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సీబీఐ, ఈడీ విచారణ సందర్భంగా జగన్‌కు సంబంధించిన పలు ఆస్తులను అటాచ్ చేశాయి. అటాచ్ చేసిన ఆస్తులన్నీ కూడా జగన్ అక్రమంగా సంపాదించారనే అనుమానంతో చేసినవే! అలాంటి ఆస్తులను ఈడీ కేసులు క్లియర్ అయ్యే వరకు జగన్ కూడా అమ్మడానికి వీల్లేదు. ట్రాన్స్‌ఫర్ చేయడానికి కూడా ఆయనకు హక్కు ఉండదు.