వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి, వై.ఎస్‌.షర్మిల రెడ్డి మధ్య ఆస్తుల పంపకానికి సంబంధించిన వ్యవహారం కొలక్కి వచ్చింది.

ఆస్తులు పంచుకుంటే కాళ్ల బేరమా?

వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan), వై.ఎస్‌.షర్మిల(YS sharmila) రెడ్డి మధ్య ఆస్తుల పంపకానికి(Assests Distributions) సంబంధించిన వ్యవహారం కొలక్కి వచ్చింది. బేరం కుదిరింది. రాయబేరం అంటూ ఓ తెలుగు దిన పత్రిక బ్యానర్‌ స్టోరీని ప్రచురించింది. చెల్లితో రాయబేరం చేశారు. బేరం కుదిరిందన్నది ఆ వార్త కథనం సారాంశం. వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి, వై.ఎస్‌.షర్మిలా రెడ్డికి మధ్య ఆస్తులకు సంబంధించిన వివాదం ఉన్నదన్నది అందరికీ తెలిసిన విషయమే! ఎవరూ దాచే విషయం కూడా కాదు. సాక్షాత్తూ వై.ఎస్‌.షర్మిలనే గతంలో ఈ విషయం చెప్పారు. ఏ కుటుంబంలోనైనా ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఉంటాయని, తమ కుటుంబంలోనూ ఉన్నాయని, వాటిని తామే సర్దుబాటు చేసుకుంటామని షర్మిల తెలిపారు. గడచిన ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్‌(Congress) పార్టీ రాష్ట్ర చీఫ్‌గా జగన్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. నరేంద్రమోది(Narendra modi), జగన్‌ మధ్య సాన్నిహిత్యం ఉందని, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు బీజేపీ(BJP) అంటే బాబు, జగన్, పవన్‌(Pawan kalayn) అంటూ షర్మిల భాష్యం చెప్పారు. ఇప్పుడు జగన్‌, షర్మిల మధ్య ఆస్తుల పంపకానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, జగన్మోహన్‌రెడ్డి దిగొచ్చి, కాళ్ల బేరానికి వచ్చారన్నది ఆ పత్రిక రాసిన కథనం. ఒక అన్నా చెల్లెలు మధ్య ఆస్తుల పంపకం జరిగితే కాళ్ల బేరమవుతుందా? ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అన్నదమ్ములు, అన్నా చెల్లెళ్లు ఆస్తులను పంచుకోవడమన్నది కొత్తా? ఆస్తుల పంపకం జరిగితే అది బేరం ఎలా అవుతుంది? ఆస్తుల పంపకానికి ఓ అన్న ముందుకు వస్తే అది కాళ్ల బేరం ఎలా అవుతుంది? సరే, ఇప్పుడు కాళ్ల బేరానికి వెళ్లడం వల్ల జగన్‌కు వచ్చే లాభమేమిటి? ఒకవేళ జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌తో కలవాలనుకుంటే షర్మిల ఆపగలుగుతారా? కాంగ్రెస్‌ పార్టీ జగన్‌తో కలిసి పని చేయాలనుకుంటే షర్మిల కాదంటారా? ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ షర్మిల అంత పవర్‌ఫుల్లా? అసలు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న బలమెంత? షర్మిలతోనే పార్టీ పునర్‌జీవం పొందగలదని నమ్ముతున్న కాంగ్రెస్‌ వాదులెంత మంది ఉన్నారు? ఎందుకు జగన్‌ కాళ్లబేరానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినట్టు? ఆస్తులు పంచుకుంటుంటే అది కాళ్లబేరం ఎలా అవుతుందో ఆ పత్రికవారికే తెలియాలి? గతంలో చంద్రబాబునాయుడు(chandrababau), ఆయన తమ్ముడు రామ్మూర్తినాయుడు(Ramurthi) మధ్య విభేదాలు వచ్చాయి. రామ్మూర్తినాయుడు కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేశారు. ఆ తర్వాత ఇద్దరు కలిసిపోయారు. అంటే చంద్రబాబు కాళ్లబేరానికి వచ్చినట్టా? దగ్గుబాటి వెంకటేశ్వరరావు- పురంధేశ్వరి(purandeshwari) దంపతులు వైస్రాయ్‌ కుట్రలో భాగస్వాములు. ఆ తర్వాత చంద్రబాబు నైజం తెలుసుకుని బయటకు వచ్చారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు చంద్రబాబు-పురంధేశ్వరి ఒక్కటయ్యారు. చంద్రబాబుపై ఈగ కూడా వాలనివ్వడం లేదు. ఆమె బీజేపీ ఎంపీ అయినప్పటికీ తెలుగుదేశంపార్టీపై ఎవరైనా ఏమైనా అంటే విరుచుకుపడుతున్నారు. అంటే చంద్రబాబు కాళ్లబేరానికి వచ్చినట్టా? లేక పురంధేశ్వరి కాళ్లబేరానికి వచ్చినట్టా? అంతెందుకు నందరమూరి హరికృష్ణ ఎపిసోడ్‌ గుర్తుంది కదా! చంద్రబాబుతో తెగతెంపులు చేసుకుని సొంతంగా పార్టీ పెట్టారాయన! తర్వాత కలిసిపోయారు. ఒక కుటుంబంలో ఉన్నవారి మధ్య భిన్నమైన ఆలోచనలు ఉండటం సహజం. రాజకీయ వైరుధ్యాలు ఉండటం కూడా సహజమే! కాని ఫ్యామిలీగా వారు ఎప్పుడైనా కలిసిపోతారు. ఇలాంటివి ఎన్నో చూశాం. ఆ విషయం వదిలేస్తే ఇప్పుడు చెల్లెలుకు జగన్‌ ఆస్తులు ఇవ్వలేదని రాస్తున్నారు కదా! అలా రాస్తున్న వారిలో ఎంత మంది తమ చెల్లెళ్లకు ఆస్తులు పంచి ఇచ్చారు? గుండెమీద చేయి వేసుకుని నిజం చెప్పగలరా? తండ్రి సంపాదించిన ఆస్తులను చెల్లికి ఇవ్వడానికే చచ్చిపోతుంటారు. అన్న కష్టపడి సంపాదించిన ఆస్తిలో చెల్లెలికి కూడా వాటా ఉందని ఏ చట్టమూ చెప్పలేదు. ఇలాంటి రాతలు రాసి రాక్షసానందం పొందాలనుకుంటే హాయిగా పొందవచ్చు. కానీ ఇంత పెద్ద వార్త కథనం వల్ల ప్రజలకు వచ్చేదేమిటి? ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది. మరో విషయం. కాంగ్రెస్‌ పార్టీ నుంచి జగన్‌ బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ఆయనపై రకరకాల కేసులు పెట్టారు. ఆయనకు సంబంధించిన కొన్ని ఆస్తులను ఈడీ అటాచ్‌ కూడా చేసింది. అలాంటి ఆస్తులను ఎలా పంచి ఇవ్వగలరు జగన్‌?



Updated On 22 Oct 2024 6:00 AM GMT
Eha Tv

Eha Tv

Next Story