వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan)-వై.ఎస్‌.షర్మిల(YS sharmila) మధ్య నడుస్తోన్న ఆస్తుల పంచాయితీని(assests) ఓ వర్గం మీడియా(Media) పెద్దగా సెలెబ్రేట్ చేసుకుంటోంది

వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan)-వై.ఎస్‌.షర్మిల(YS sharmila) మధ్య నడుస్తోన్న ఆస్తుల పంచాయితీని(assests) ఓ వర్గం మీడియా(Media) పెద్దగా సెలెబ్రేట్ చేసుకుంటోంది. జగన్మోహన్‌రెడ్డి తన తల్లిని గెంటేశారు. చెల్లికి ఆస్తిని ఇవ్వనంటున్నారు అంటూ చాలా పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నాదా మీడియా! విజయమ్మ, షర్మిల తరఫున వకల్తా పుచ్చుకుని జగన్మోహన్‌రెడ్డిపై టన్నుల కొద్ది బురద చల్లడానికి సిద్ధమయ్యాయి కొన్ని బూతు చానెళ్లు. కొన్ని కల్తీ వార్తలు ప్రసారం చేసే మీడియా, ఓ వర్గం కోసమే పని చేసే మీడియా, బూతు కథనాలు ప్రసారం చేసే మీడియా, ఓ వ్యక్తి టార్గెట్‌గా పని చేసే మీడియా ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) దురదృష్టవశాత్తూ యాక్టివ్‌గా ఉంది. ఇలాంటి మీడియాకు ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు, అమ్మాయిలను పెట్రోల్ పోసి కాల్చి చంపిన సంఘటనలు అసలు కనిపించడం లేదు. కనబడవు కూడా. ఇలాంటి మీడియాకు కనిపిస్తున్నది జగన్మోహన్‌రెడ్డి ఇంట్లో వివాదం ఎలా ప్రసారం చేయాలి? విభేదాలను ఎలా ప్రసారం చేయాలి? జగన్మోహన్‌రెడ్డి ప్రతిష్టను ఏ విధంగా మసకబారించాలి? అన్న తాపత్రయమే తప్ప రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు మీడియా కంటపడటం లేదు. జగన్‌-షర్మిల ఆస్తుల గొడవలను చాలా పెద్ద ఇష్యూగా మార్చి, దాని ద్వారా రాజకీయ లబ్ది పొందాలన్ననే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేస్తే చేయవచ్చు కానీ దురదృష్టవశాత్తూ ప్రపంచం మొత్తానికి నీతులు చెప్పే మీడియా ఈ పర్టిక్యులర్‌ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రాధాన్యత ఇవ్వడం కరెక్టే కానీ, ఇది వార్తలాగే ప్రజెంట్‌ చేయాలి తప్పితే గొడవల వెనుక ఏదో ఉందంటూ అభూత కల్పనలు రాయడం మంచిది కాదు. జగన్‌-షర్మిల ఆస్తుల పంచాయితీకి సంబంధించి ఆ మీడియా ప్రసారం చేస్తున్న కథలన్నీ పచ్చి అబద్ధాలు. ఒక్క ముక్క కూడా నమ్మదగింది కాదు. అవాస్తవాలను ప్రసారం చేస్తున్నదా ఛానెల్‌! ఈ అంశంలో జగన్‌ను ఒక విలన్‌గా చూపించే ప్రయత్నం జరుగుతోంది. ఇలా ప్రసారం చేస్తున్న మీడియా పెద్దలంతా తమ చెల్లెళ్లకు ఆస్తులు పంచి ఇచ్చారా? ఎన్టీఆర్‌(NTR) సతీమణి లక్ష్మిపార్వతిని(Lakshmi parvathi) తెలుగుదేశంపార్టీ, దాని అనుకూల మీడియా ఎంతగా వేధించాయో చూశాం! ఆమె ఇంట్లో లేని సమయంలో సామాను అంతా బయటపారేశి గోడలను కూలగొట్టలేదా? అప్పుడు ఈ మీడియా ఎందుకు రియాక్టవ్వలేదు? అన్యాయం, అక్రమం అంటూ ఎందుకు ఆక్రోశించలేదు? ఆ మీడియాలో వచ్చేది అంతా అభూత కల్పనలే అనడానికి చాలా ఎగ్జాంపుల్స్‌ ఉన్నాయి. మూడు రోజుల వ్యవధిలోనే ఆ మీడియా పరస్పర విరుద్ధమైన కథనాలను వండి వార్చింది. మొదటి కథ నిజమైతే రెండో వార్త కథనం అబద్ధం కావాలి. ఆ రెండూ నిజం అయి ఉండే అవకాశం లేదు. తెలిసి తెలిసీ ఒక అబద్ధాన్ని ప్రచారంలో పెట్టి ప్రజలను మోసం చేయడానికి ఆ మీడియా ప్రయత్నిస్తున్నదనుకోవాలి. ఆ మీడియాలో రెండు రోజుల కిందట ఏం రాసిందంటే, ఏదో ఒక జాతీయ పార్టీ అండ అవసరం అని అనుకుంటున్న జగన్‌ కాంగ్రెసుతో కలవడానికి ప్రయత్నిస్తున్నారని.. అందుకోసం చెల్లెలితో రాజీపడి ఒక డీల్ కుదుర్చుకున్నారని రాసింది. అందుకోసం షర్మిలకు తమ తండ్రి ఆస్తుల్లో వాటాలు పంచి ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి అంగీకరించినట్టుగా రాసుకొచ్చారు. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్(DK shiva kumar reddy) రాజీ కుదిర్చినట్టుగా రాశారు. కేవలం ఆ డీల్ సంగతి తేల్చడం కోసం మాత్రమే జగన్ పలుమార్లు బెంగుళూరు నివాసానికి సతీసమేతంగా వెళ్లినట్టుగా తమ వార్త కథనంలో చెప్పుకొచ్చారు. నిన్నటికి నిన్న అదే మీడియా మరో ప్రచారాన్ని ప్రారంభించింది. సరస్వతి పవర్ సంస్థలో షేర్లకు సంబంధించిన వివాదంలో జగన్ కోర్టులో వేశారు. ఈ క్రమంలో సెప్టెంబరులోనే చెల్లెలితో రాజీకి జగన్ ప్రయత్నించాడని కొత్తగా చెబుతూ వస్తున్నదా మీడియా! జగన్‌ కండిషన్లపై షర్మిల ఘాటుగా రిప్లై ఇచ్చినట్టు రాసింది. ఒకవేళ షర్మిల హెచ్చరికలు నిజమైతే బెంగళూరులో రాజీ కుదరడం తప్పనుకోవాలి. అది నిజమైతే హెచ్చరికలు తప్పవ్వాలి. అంటే ఏదో ఒక తప్పుడు కథనాన్ని వండి వార్చడమే ఆ మీడియా పని అని తేలిపోయింది.



Eha Tv

Eha Tv

Next Story