Kutami Govt Master Plan : జనసేన కోసం రాజీనామా చేయనున్న వైసీపీ ఎమ్మెల్సీ!
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి(YSRCP) చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా(Resign) చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి(YSRCP) చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా(Resign) చేశారు. వారు రాజీనామాను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే వారి స్థానాల్లో ఇంకొందరు రాజ్యసభకు వెళ్లాలి. ఇప్పుడు వారు తెలుగుదేశంపార్టీ(TDP) నుంచో, జనసేన(Janasena) పార్టీ నుంచో, బీజేపీ(BJP) నుంచో వారు రాజ్యసభకు వెళతారు. రాజీనామా చేయడానికి వారు చెప్పే కారణాలు ఏమైనప్పటికీ ఇదే వాస్తవం! బీరం మస్తాన్ రావు, మొగిలి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్యలను రాజ్యసభకు పంపిందే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ! ఇప్పుడు ఆ పార్టీకి కూడా వారు రాజీనామా చేశారు. ఖాళీ అయిన ఈ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన వారు పదవుల్లో ఉంటే వారితో రాజీనామాలు చేయించి, ఆ స్థానాలలో తమ వారిని పంపడమన్నది కూటమి సరికొత్త ప్లాన్. గతంలో చంద్రబాబునాయుడు(Chandrababu) అధికారంలో ఉన్నప్పుడు వైఎస్‌ఆర్ పార్టీ నుంచి గెలిచిన వారిని తెలుగుదేశంపార్టీలో చేర్చుకున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పని చేసింది. తెలుగుదేశంపార్టీకి చెందిన వారిని తమ పార్టీలోకి లాగేసుకుంది. జనసేన పార్టీ నుంచి గెలిచిన వ్యక్తిని కూడా తమలో కలిపేసుకుంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. మద్దాల గిరి(Maddala giri), గణేష్‌లను(Ganesh) కూడా ఇలాగే చేర్చుకుంది వైసీసీ. రాజకీయపార్టీలేవీ సొక్కమైనవి కావు. అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట మాట్లాడటం పార్టీలకు బాగా అలవాటయ్యింది. ఇప్పుడు కూటమి సరికొత్త వ్యూహాన్ని పన్నింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో ఉన్నవారిని తమ పదవులకు రాజీనామా చేయించి, ఆ స్థానాన్ని మళ్లీ వారికే అప్పగించడమో, లేకపోతే మరొకరికి ఇవ్వడమో చేస్తున్నది. ఆ పదవి మీకే ఉండాలంటే ఓ లెక్క, మరొకరికి ఇవ్వాలంటే మరో లెక్క అని టీడీపీ చెబుతున్నదట! ప్రస్తుతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ త్వరలో రాజీనామా చేయబోతున్నారు. ఈయన స్థానంలో జనసేన పార్టీకి చెందిన ఓ వ్యక్తి మండలిలోకి వెళ్లబోతున్నారు. ఉమ్మడి కృష్ణ జిల్లాకు చెందిన ఓ బీసీ సామాజికవర్గ నేత ఈ పని చేయబోతున్నారు.