ఆంధ్రజ్యోతి(Andhra Jyoti) గ్రూపు సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణకు (Radhakrishna)ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో వైఫల్యాలు విపరీతంగా కనిపిస్తున్నాయి.

ఆంధ్రజ్యోతి(Andhra Jyoti) గ్రూపు సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణకు (Radhakrishna)ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో వైఫల్యాలు విపరీతంగా కనిపిస్తున్నాయి. వైఫల్యాలపైన పదే పదే వార్తలు రాస్తున్నారు. ఆయన కొత్త పలుకు ద్వారా సుద్దులు కూడా చెబుతున్నారు. ప్రభుత్వం ఇంకా గాడిలో పడలేదని, తప్పులపైన తప్పులు చేస్తున్నదని అంటూ ఆంధ్రప్రదేశ్‌ సర్కారుకు తమ నాయకులపైనా, అధికారులపైనా నియంత్రణ లేకుండా పోతోన్నదని చెప్పుకొచ్చారు ఆర్కే! కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా దోపిడీలు చేస్తున్నారని, అధికారులు ముఖ్యమంత్రి మాట కూడా వినే పరిస్థితులో లేరని రాధాకృష్ణ సెలవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ఇంకా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) నాయకులు చెప్పినట్టు జరుగుతోందని, ఇంకా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలమైన అధికారులే ప్రభుత్వంలో కీలకమైన పదవుల్లో ఉన్నారని ఆర్కే అంటున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై పదే పదే విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక ఉచితంగా ఇచ్చే విధానం అమలు కావడం లేదని చెబుతున్నారు. ఉచిత ఇసుక పేరుతో చంద్రబాబునాయుడు(Chandrababu) అభాసుపాలయ్యారని దెబ్బిపొడుస్తున్నారు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విధానానికి సంబంధించిన టెండర్లలలో తెలుగుదేశంపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాదు రేషన్‌ బియ్యాన్ని తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా కాంట్రాక్టులు పొంది దోచేస్తున్నారని ఆరోపించారు. నిత్యావసరవస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని చెబుతున్నారు. ఈ రకంగా దాదాపు 30, 40 అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని తప్పుపడుతూ గడచిన కొద్ది రోజులుగా, దాదాపు నాలుగు వారాలుగా వార్తలు రాస్తూ వస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపడమన్నది జర్నలిస్టు బాధ్యత. అయితే రాధాకృష్ణ కొత్తగా జర్నలిస్టు అవ్వలేదు. ఆయన సుదీర్ఘ కాలంగా జర్నలిజంలో ఉన్నారు. ఆయన ఆంధ్రజ్యోతి పేపర్‌ను టేకోవర్‌ చేసిన తర్వాత తెలుగుదేశంపార్టీకి(TDP) చెందిన అనుబంధ పత్రికగా దాన్ని మార్చేశారు. ఆంధ్రజ్యోతి టీడీపీ అనుబంధ పత్రికగా మారిన తర్వాత కూడా అంటే ఇంతకు ముందు కూడా తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉండింది. అప్పుడు తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం చేసిన తప్పులు ఆయనకు కనిపించలేదు. ఈ రెండు నెలల కాలంలో ఆయనకు ఎందుకు కనిపిస్తున్నాయి? 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉండింది. 2019లో దారుణంగా ఓడిపోయింది. అందుకు కారణంగా జన్మభూమి కమిటీలేనని ఆ పార్టీ నాయకులే చెప్పారు. అంతర్గత సమావేశాలలో చర్చ కూడా జరిగింది. అయితే రాధాకృష్ణకు మాత్రం జన్మభూమి కమిటీలతో జరుగుతున్న ఆరాచకాలు కనిపించలేదు. కనీసం హెచ్చరికలు కూడా చేయలేదు. ప్రత్యేకహోదా కోసం అనేక స్వచ్ఛంద సంస్థలు, పార్టీలు ఉద్యమాలు చేశాయి. అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అవసరం కదా అని రాధాకృష్ణ రాయలేదు. ఎప్పుడైతే బీజేపీతో (BJP)టీడీపీ తెగతెంపులు చేసుకుందో అప్పుడు రాధాకృష్ణకు ప్రత్యేక హోదా గుర్తుకు వచ్చింది. ఆ సమయంలో భారతీయ జనతాపార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. 2014లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. అప్పుడు కూడా ఎమ్మెల్యేలు దోచుకున్నారని ఇప్పుడు రాస్తున్నారు కానీ, ఇదే మాట రాధాకృష్ణ అప్పుడు ఎందుకు రాయలేకపోయారు? ఇప్పుడు రాధాకృష్ణ చేస్తున్న విమర్శలకు, ఆరోపణలకు, రాస్తున్న వార్తల పట్ల తెలుగుదేశంపార్టీ మౌనంగా ఉంటోంది. క్యాడర్‌ కూడా గమ్మున ఉంటోంది. టీడీపీ ఎందుకు మౌనంగా ఉంటోంది? ఆర్కే రాసింది తప్పని ఎందుకు కౌంటర్లు ఇవ్వలేకపోతున్నది?

Eha Tv

Eha Tv

Next Story