AP BJP Leaders : ఏపీ బీజేపీ నేతలు ఆ పార్టీలోనే ఉన్నారా ?
ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ(AP BJP) ఉందా?
ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ(AP BJP) ఉందా? ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారా? ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ గొంతు ఎందుకు వినిపించడం లేదు? ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నాయకులు ఎందుకు కనిపించడం లేదు? ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ కూటమి సర్కారులో భాగస్వామిగా ఉంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే(NDA) సర్కారులో టీడీపీ భాగస్వామగా ఉంది. తెలుగుదేశంపార్టీకి చెందిన సభ్యులు కేంద్ర మంత్రివర్గంలో కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాల పట్ల వ్యూహాత్మక మౌనం అని అనలేం కానీ కన్వీనియంట్ సైలెన్స్‌ను మెయింటైన్ చేస్తోంది బీజేపీ. ఆంధ్రప్రదేశ్‌లో నరేంద్రమోదీ టార్గెట్‌గా, బీజేపీ టార్గెట్‌గా విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంపార్టీ అనుకూల మీడియానే నరేంద్రమోదీని(PM narednra modi) ఒక అవినీతిపరుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కనీస స్పందన కూడా భారతీయ జనతా పార్టీ నాయకుల నుంచి కనిపించకపోవడం దురదృష్టం. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని(TDP) మోస్తున్న కొన్ని మీడియా సంస్థలు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందానికి సంబంధించి అదానీపైనా, నరేంద్రమోదీపైనా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అదానీకి తమకు సంబంధం లేదని కానీ, అదానీ తప్పు చేస్తే తమకేమిటీ సంబంధం అని కానీ, అసలు అదానీ తప్పు చేయలేదని కానీ, ఒకవేళ అదానీ తప్పు చేసి ఉంటే దానికి మోదీతో ముడిపెట్టడమేమిటని కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేకపోతున్నారు. దేశంలో ఎక్కడో జరిగిందనుకోవడానికి లేదు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంపార్టీ మీడియా రోజూ రాస్తున్నది. నరేంద్రమోదీ లాంటి ఒక వ్యక్తిని ఒక విలన్‌గా, ఒక రాక్షసుడిగా చూపిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంపార్టీ అనుకూల మీడియా రాసిన వార్తలు ఉన్నాయి. అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా స్పందించలేదు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి గవర్నర్‌ను కలిసి అదానీ వ్యవహారంపైన విచారణ జరిపించాలని, జగన్మోహన్‌రెడ్డిపైన విచారణ జరిపించి, ఆయనను అరెస్ట్ చేయించండి అని చెబుతూ భారతీయ జనతా పార్టీపైన తీవ్రమైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా ఆమె బాధ్యత ఆమె నిర్వర్తించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అదానిపైన పోరాటం చేస్తున్నది కాబట్టి, పార్లమెంట్ కూడా స్తంభింపచేసింది కాబట్టి అదే కోవలో షర్మిల ఆంధ్రప్రదేశ్‌లో పోరాటం చేస్తున్నారు. గవర్నర్‌ను కలిశారు. కలిసి బయటకు వచ్చినప్పుడు బీజేపీపైన తీవ్రమైన విమర్శలు చేశారు. విమర్శలు చేస్తే ఒక్కరంటే ఒక్క బీజేపీ నాయకుడు కూడా ఖండించపోవడాన్ని ఏమనుకోవాలి? ఎందుకంత మౌనం పాటిస్తున్నారు? ప్రధాని మోదీని పట్టుకుని అన్నసి మాటలంటుంటే ఒక్కరు కూడా మాట్లాడకపోవడమేమిటి? ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఉన్నారు. లోక్‌సభ సభ్యులు ఉన్నారు. కేంద్రమంత్రులు ఉన్నారు. ఏ ఒక్కరు ఎందుకు మాట్లాడటం లేదు? పార్టీ అధ్యక్షురాలు కూడా గమ్మున ఉంటున్నారు.