YCP Letter Facts : అమ్మకు కనపడని వాస్తవాలు!
వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan), వై.ఎస్.షర్మిల(YS Sharmila) మధ్య ఆస్తుల గొడవపై ఇప్పటి వరకు మౌనంగా ఉన్న విజయమ్మ మంగళవారం ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు.
వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan), వై.ఎస్.షర్మిల(YS Sharmila) మధ్య ఆస్తుల గొడవపై ఇప్పటి వరకు మౌనంగా ఉన్న విజయమ్మ మంగళవారం ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. జగన్, షర్మిల మధ్య నెలకొన్న వివాదాన్ని వారే పరిష్కరించుకుంటారని, ఇందులో ఇతరుల జోక్యం అనవసరమని విజయమ్మ(Vijayamma) లేఖలో ప్రస్తావించారు. సుదీర్ఘమైన తన లేఖలో తప్పంతా జగన్‌దే అన్నట్టుగా ఆమె రాసుకొచ్చారు. సహజంగానే ఈ లేఖతో తెలుగుదేశంపార్టీ అనుకూల మీడియా పండగ చేసుకుంది. ఈ లేఖను పతాక శీర్షికలో ప్రచురించి సంబరపడింది. ఇది ఊహించిందే. గడచిన రెండు దశాబ్దాలుగా ఇలాంటి మీడియా చేష్టలకు జగన్మోహన్‌రెడ్డి బాధితుడు. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఓ వర్గం మీడియాకు బాధితుడు. ఆయన వ్యక్తిత్వ హనానికి పాల్పడటమే ఆ మీడియా పని. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి(YS Rajshekar reddy) ఉన్న రోజుల నుంచి ఆ మీడియా ఇలాగే బిహేవ్ చేస్తూ వస్తున్నది. జగన్మోహన్‌రెడ్డి లోక్‌సభ సభ్యుడు అవ్వకముందు నుంచే , జగన్మోహన్‌రెడ్డి చట్ట సభలకు వెళ్లక ముందే ఆయన క్యారెక్టర్‌ను చంపేసే ప్రయత్నం చేస్తూ వచ్చిందీ మీడియా! ఓ రాజకీయ పార్టీపైనా, ఓ రాజకీయ నాయకుడిపైనా ప్రత్యర్థి పార్టీలు విమర్శలు, ఆరోపణలు చేయడం సహజం. ఈ విషయంలో జగన్మోహన్‌రెడ్డిపై తెలుగుదేశంపార్టీ విమర్శలు చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ఒక మీడియా వికృతంగా, విషపూరితంగా ఓ వ్యక్తి చెడ్డవాడంటూ పదే పదే దుష్ర్పచారం చేస్తున్నప్పుడు సత్యాసత్యాలను చెప్పే బాధ్యత ఇండిపెండెంట్ జర్నలిస్టులకు ఉంటుంది. వై.ఎస్. విజయమ్మ రాసిన లేఖ పూర్తిగా షర్మిల నోటి నుంచి వచ్చిదనే అని అర్థమవుతోంది. ఈ లేఖను ఆధారం చేసుకుని టీడీపీ అనుకూల మీడియా తమ పెన్నుకొచ్చిందంతా రాసుకొచ్చింది. బోల్డంత సిరాను కక్కింది. జగన్మోహన్‌రెడ్డి తల్లిని, చెల్లిని మోసం చేశాడంటూ రాస్తున్నాయి. ఇలాంటి రాతలకు ఆస్కారమిచ్చింది విజయమ్మనే! అయితే సుదీర్ఘమైన తన లేఖలో విజయమ్మ కొన్ని విషయాలను వదిలేశారు. ఈ వదిలేయడం వెనుక ఏదైనా ఆంతర్యముందా? సమాధానాలు చెప్పలేక వదిలేశారా? అన్నా చెల్లి మధ్య ఆస్తులకు సంబంధించిన వివాదం నడుస్తున్నప్పుడు, అన్నా చెల్లి ఒకరిపై ఒకరు రహస్యంగా లేఖలు రాసుకుంటున్న సందర్భంలో ఆ ఉత్తరాలకు సంబంధించిన వివాదం బయటకు వచ్చిన నేపథ్యంలో , ఎలా బయటకు వచ్చింది? అన్నా చెల్లి రహస్యంగా రాసుకున్న ఉత్తరాలు తెలుగుదేశంపార్టీ ట్విట్టర్ హ్యాండిల్‌లో అధికారికంగా పోస్టు చేస్తే, దానికి జగన్ కౌంటర్ ఇస్తే, మళ్లీ దానికి షర్మిల ప్రెస్‌మీట్ పెట్టి కన్నీరు కారిస్తే, అందుకు విజయసాయిరెడ్డి జవాబు ఇస్తే, దానికి కౌంటర్‌గా విజయమ్మ ఓ లేఖ రాశారు. ఈ మొత్తం ఎపిసోడ్ ఎక్కడ ప్రారంభమయ్యింది? తెలుగుదేశం పార్టీ అధికారిక ఎక్స్ అకౌంట్‌లో షర్మిల లెటర్ ప్రత్యక్షం కావడం ద్వారా..! ఓ అన్నా చెల్లి రాసుకున్న వ్యక్తిగత లేఖలు టీడీపీ ట్విట్టర్‌లో ఎందుకొచ్చాయన్న విషయాన్ని గమనిస్తే మొత్తం వెనక ఏం జరుగుతుందో ఈజీగా అర్థమైపోతుంది. విజయమ్మ రాసిన లేఖలో 'ఆస్తి అందరిది, పిల్లలందరికీ సమాన వాట ఉంటుంది. ఈ ఆస్తిని జగన్మోహన్‌రెడ్డి కష్టపడి సంపాదించినప్పటికీ షర్మిలకు వాట ఉంటుంది. వాటా ఇస్తానని జగన్ ఇవ్వలేదు' అంటూ విజయమ్మ లేఖలో ప్రస్తావించారు. ఈ విషయాన్ని ఆమె ఎవరికి చెప్పారు? రాష్ట్ర ప్రజలందరికి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభిమానులందరికి. ఆమె ఈ లేఖను బహిరంగపర్చాల్సిన అవసరం ఎందుకొచ్చింది? వైఎస్ అభిమానులలో ఆందోళన, మానసిక క్షోభ, ఏం జరుగుతుందన్న టెన్షన్ రావడానికి కారణం ఎక్కడ మొదలయ్యింది? తెలుగుదేశంపార్టీ ట్విట్టర్‌లో! టీడీపీ అఫిషియల్ ట్విట్టర్‌లోకి ఆ లేఖ ఎలా వచ్చింది? విజయమ్మ లేఖలో రాయాల్సిన మొదటి అంశం ' మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత లేఖలను ఎవరో బయటకు తీసుకెళ్లారు. తీసుకెళ్లి దానిపైన రాజకీయం చేస్తున్నారు. అలాంటి వాళ్ల ట్రాప్‌లో మీరు పడకండి. మేమంతా బాగానే ఉన్నాం. కుటుంబంలో ఉన్న చిన్నపాటి వివాదాలను సర్దుకుంటాం' అని ఆమె చెప్పొచ్చు. లేదూ ఆమె తన బిడ్డలిద్దరికి లేఖలు రాస్తూ మీరు ఇలా కొట్టుకోకండి అని హితవు చెప్పొచ్చు. బిడ్డలిద్దరిని నచ్చచెప్పే చనువు విజయమ్మకు ఉంది. మరి ఆమె ఎందుకు ఈ పని చేయలేదు? తెలుగుదేశంపార్టీ అనుకూల మీడియాకు షర్మిల తన లేఖను ఎందుకిచ్చారు? ఇవ్వకపోతే టీడీపీ వాళ్లే దొంగిలించారా? దొంగిలిస్తే కేసు పెట్టారా? షేర్ల ట్రాన్స్‌ఫర్ అయితే జగన్ బెయిల్ రద్దు అవుతుందని తెలిసీ విజయమ్మ ఎందుకు చెప్పలేదు? నిజంగానే ఆమెకు ఈ విషయం తెలియదా? ఒకవేళ బెయిల్‌కు షేర్ల ట్రాన్స్‌ఫర్‌కు సంబంధం లేదనుకుంటే ఆ విషయమైనా చెప్పాలి కదా! వైఎస్ ముఖ్యమంత్రి కాక ముందునుంచే జగన్‌కు వ్యాపారాలు ఉన్నాయి. ఈ విషయం అందరికీ తెలుసు. స్వయంగా రాజశేఖర్‌రెడ్డినే ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పారు.