ఆంధ్రప్రదేశ్‌లో కూటమి(TDP alliance) ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు , ప్రభుత్వ పరిపాలనా తీరు, వంద రోజుల పాలనలో కూటమి చేసిన పనులు ప్రతిపక్ష నేత అయిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP)

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి(TDP alliance) ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు , ప్రభుత్వ పరిపాలనా తీరు, వంద రోజుల పాలనలో కూటమి చేసిన పనులు ప్రతిపక్ష నేత అయిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి(YS Jagan) పిచ్చ కాన్ఫిడెన్స్‌ను ఇస్తున్నాయి. ప్రతిపక్ష నేత అంటే అసెంబ్లీలో అధికార పక్షం ఇచ్చే గౌరవం మాత్రమే కాదు, అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఆయనకు మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆయనను ప్రతిపక్ష నేత అని అనవచ్చు. కూటమికి సంబంధించిన నేతల చర్యలు, వారు చేస్తున్న వ్యాఖ్యలు జగన్మోహన్‌రెడ్డికి జీవన్‌టోన్‌ టానిక్‌ అవుతున్నాయి. గత పది రోజులుగా ఆయన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో జిల్లాల వారీగా సమావేశమవుతున్నారు. జిల్లా అధ్యక్షులను నియమిస్తున్నారు. మాజీ మంత్రులంతా కూడా జిల్లాలలో పార్టీ బాధ్యతను తీసుకోవాలని జగన్ చెప్పారు. తమిళనాడు తరహా ఫార్ములాను ఇక్కడ ఇంప్లిమెంట్‌ చేస్తున్నట్టు కనిపిస్తోంది. తమిళనాడులో మంత్రివర్గంలో ఉన్నవారు అది అన్నా డీఎంకే(DMK) అయి ఉండవచ్చు, డీఎంకే అయి ఉండవచ్చుఅధికారం కోల్పోయిన తర్వాత జిల్లాలకు పార్టీ అధ్యక్షులుగా ఉంటూ జిల్లాకు సంబంధించిన పార్టీ వ్యవహారాలను చూసుకుంటుంటారు. ముఖ్యంగా డీఎంకే ఈ ఫార్ములాను పాటిస్తూ వస్తున్నది. ఇప్పుడు అదే ఫార్ములాను ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి పాటిస్తున్నారు. మెజారిటీ ప్రాంతాలలో మాజీ మంత్రులకే అధ్యక్ష బాధ్యతలను ఇచ్చారు. అలా చేస్తూ వస్తున్న క్రమంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బుధ, గురువారాలలో మాట్లాడిన మాటలను బట్టి చూస్తే, ఆయనలో చాలా చాలా కాన్ఫిడెన్స్‌ కనిపిస్తోంది. మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రజలకు అయిదేళ్ల కాలం ప్రజలకు ఇంటి దగ్గరే సర్వీసులు అందించాం, వాలంటీర్ల ద్వారా కావచ్చు, గ్రామ సచివాలయాల ద్వారా కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ఇంటి దగ్గరకే అందించాము,వారు ఇంటి నుంచి బయటకు వచ్చే అవసరం లేకుండా , ఒక రోజు కూడా ఆలస్యం కాకుండా సంక్షేమ కార్యక్రమాలను నేరుగా వారికి అందించి ప్రజలు సంతృప్తి చెందేలా చేశామని జగన్‌ చెబుతున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అది చేయలేకపోతున్నదని కూడా అంటున్నారు. వాలంటీర్లు లేకపోయినా పెన్షన్లు ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతున్నారు కానీ షెడ్యూల్‌ కార్యక్రమాలను నిర్వహించలేకపోతున్నది. అమ్మ ఒడి కావచ్చు, చేనేత హస్తం కావచ్చు, రైతు భరోసా కావచ్చు వీటి విషయంలో ప్రభుత్వం ప్రాపర్‌గా యాక్ట్ చేయలేకపోయిందనే విమర్శలు వస్తున్నాయి. అమ్మ ఒడి ఇప్పటికీ రాకపోవడం పట్ల గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు ప్రభుత్వంపై కోపంగా ఉన్నట్టు సమాచారం. గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న ఫీడ్‌ బ్యాక్‌ కూడా జగన్మోహన్‌రెడ్డిలో కాన్ఫిడెన్స్‌ పెంచుతున్నది. ప్రభుత్వం విఫలం చెందిందనే కంక్లూజన్‌ కు జగన్‌ వచ్చారు.

Eha Tv

Eha Tv

Next Story