ఆంధ్రప్రదేశ్‌లో అప్పులు(AP debts) అంశానికి సంబంధించి నిజమేమిటి?

ఆంధ్రప్రదేశ్‌లో అప్పులు(AP debts) అంశానికి సంబంధించి నిజమేమిటి? అంటే ఆ నిజాన్ని అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పింది. ఆ వాస్తవం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్‌ అప్పు ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు! కార్పొరేషన్‌ అప్పులతో కలిపి, ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులుతో కలిపి ఆరు లక్షల 49 వేల కోట్ల రూపాయలే! అయితే ఆంధ్రప్రదేశ్‌ అప్పు గురించి అధికారంలో ఉన్న కూటమికి సంబంధించిన పార్టీలు గడిచిన అయిదు సంవత్సరాలుగా చెబుతున్న మాట ఆంధ్రప్రదేశ్‌ అప్పుల్లో కూరుకుపోయిందని! ఆంధ్రప్రదేశ్‌ను జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) శ్రీలంకలా మార్చేశారని, జింబాబ్వేలా తయారు చేశారని, ఎవరూ అప్పుడు ఇచ్చే పరిస్థితి లేదని, 13 నుంచి 14 లక్షల కోట్ల రూపాయల అప్పును చేశారని అప్పట్లో తెలుగుదేశం(TDP), జనసేన(Janasena), భారతీయ జనతాపార్టీలు() తెగ విమర్శించాయి. అయితే అది నిజం కాదని అదే కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. శాసనసభలో కూటమి ప్రభుత్వం అప్పుపై వాస్తవం చెప్పిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టి మరీ చెప్పారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్‌ ప్రతిపక్ష నేతనే! ఎందుకంటే వైసీపీ కూడా 11 స్థానాలను గెల్చుకుంది. విలేకరుల సమావేశంలో జగన్‌ అప్పుపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఏ సమయంలో ఎవరు ఏం మాట్లాడారో చెప్పారు. అసెంబ్లీ రికార్డుల ప్రకారం ఏపీ చేసిన అప్పు వివరణ ఇది! మీరు మాత్రం దుష్ప్రచారం చేశారని జగన్‌ అన్నారు. 13 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడరని కూటమి నేతలపై జగన్‌ ఫైరయ్యారు. జగన్‌ ప్రెస్‌కాన్ఫరెన్స్‌ తర్వాత టీడీపీ నేతలు రియాక్టవ్వాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం నుంచి ఎవరో ఒకరు స్పందించాలి. మంత్రులో, మరొకరో మాట్లాడాల్సి ఉంది. జగన్‌ చెప్పిదంతా తప్పని చెప్పాలి. తాము అసెంబ్లీలో(AP assembly) చెప్పింది ఒకటైతే జగన్‌ బయట మరోలా చెప్పారని వివరణ ఇచ్చుకోవాలి. అసెంబ్లీలో తాము చెప్పిన అప్పుల వివరాలు కాకుండా ఇంకొన్ని అప్పులు ఉన్నాయని ప్రజలకు తెలిసేలా చెప్పాలి. కానీ ప్రభుత్వంవైపు నుంచి దీనిపై అసలు స్పందన రావడం లేదు. తాము గతంలో చెప్పినట్టు 13 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్న మాట నిజమేనని అయినా చెప్పాలి. ప్రభుత్వం అప్పు విషయంలో అడ్డంగా దొరికిపోయిందనుకోవాలా? లేదూ రియాక్టవుతే తాము చెప్పింది శుద్ద తప్పని అయినా చెప్పి ఉండాలి. కూటమి ఉన్న రాజకీయ పార్టీలు కూడా పెదవి విప్పడం లేదు. ఢిల్లీకి వెళ్లి ఆర్ధిక మంత్రికి ఫిర్యాదు కూడా చేసి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati purandeswari) అయినా మాట్లాడాలి. కానీ వీరెవరు మట్లాడలేదు . మంగళవారం ఏపీ ప్రభుత్వం అప్పు కోసం వెళుతున్నది అంటూ అడ్డమైన రాతలన్నీ రాసిన వార్త పత్రికలు కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల పక్షాన మాట్లాడుతున్న వార్త పత్రికకు దీన్ని పట్టించుకునే తీరిక ఓపిక లేవు. 13వ పేజీలో సింగిల్‌ కాలమ్‌తో సరిపెట్టుకుంది.



Updated On 14 Nov 2024 11:27 AM GMT
Eha Tv

Eha Tv

Next Story