తెలంగాణ రాజకీయాలలో కొన్ని ఆక్తికరమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ రాజకీయాలలో కొన్ని ఆక్తికరమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాలలో(TS Politics) వారం పది రోజులుగా హైడ్రాకు(HYDRA) సంబంధించిన చర్చనే సాగుతోంది. హైడ్రాకు సంబంధించిన చర్చ నుంచి ఫోకస్‌ అంతా పూర్తిగా తనవైపుకు తిప్పుకున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి(Komati Rajgopal Reddy). మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన రాశి ఫలాలు చెప్పడం మొదలుపెట్టారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Uthamkumar reddy) అంటూ జోస్యం చెప్పారు. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కుటుంబానికి కోమటిరెడ్డి కుటుంబానికి మధ్య తీవ్రమైన విభేదాలు ఉండేవి. గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌ బాధ్యతలు చేపట్టిన సమయంలో కావొచ్చు కోమటిరెడ్డి బ్రదర్స్‌ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌(Gandhi bhavan) మెట్లు కూడా ఎక్కబోమని శపథాలు చేశారు. అలాంటి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అని, ఆయన ముఖ్యమంత్రి అవుతారు అని మాట్లాడటం ఆసక్తి కలిగిస్తోంది. ఆశ్చర్యం కూడా కలిగిస్తోంది. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్‌(Congress) పార్టీలో చేరారు. అంతకంటే ముందు ఆయన భారతీయ జనతాపార్టీలో ఉన్నారు. నిజానికి 2018లో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆ తర్వాత 2023లో ఆయన బీజేపీలో చేరారు. అప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలో బీజేపీ తరఫున బరిలో దిగారు. ఆ ఎన్నికలో బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత ఆయన ఎన్నికలకు ముందు అనూహ్యంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్న సందర్భంగా అధిష్టానం ఆయనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఆయనకు క్యాబినెట్‌లో చోటు దక్కలేదు. ఇప్పుడు ఉన్నపళంగా ఉత్తమ్‌ను ఎందుకు పొగుడుతున్నారో ఈ వీడియోలో చూద్దాం.


Eha Tv

Eha Tv

Next Story