Kalki Ashramam Land Issue: దళితుల భూముల్లో గుడి! కూటమి సర్కార్ స్పందించేనా?
ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం(YSRCP) కొంతమంది స్వామిజీలకు(Swamy) అక్రమంగా భూములు కేటాయించిందని ప్రస్తుత కూటమి ప్రభుత్వం చెబుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం(YSRCP) కొంతమంది స్వామిజీలకు(Swamy) అక్రమంగా భూములు కేటాయించిందని ప్రస్తుత కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే విశాఖ శ్రీ శారద పీఠాధిపతి(sri sharada pitadipathi) స్వరూపానందేంద్ర సరస్వతికి విశాఖపట్నంలో(Vishakapatnam) ఇచ్చిన 15 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అక్కడ వేద పాఠశాల, ఆశ్రమం నిర్మించడం కోసం స్వరూపానందేంద్ర ఆ స్థలాన్ని తీసుకున్నట్టుగా చెబుతున్నారు. అక్కడ ఏదో మసాజ్ సెంటర్లు(Massage Centers) పెట్టారంటూ తెలుగుదేశం పార్టీ(TDP) అనుకూల మీడియా కథనాలు రాసింది. శారదా పీఠంపై, స్వరూపానందేంద్రపై ఓ పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తూ వచ్చింది. కూటమి అధికారంలోకి రాగానే కక్షగట్టి మరీ ఆ భూములను వెనక్కి తీసుకుంది ప్రభుత్వం. అలాగే తిరుమలలో కాటేజ్(Thirumala cottage) విషయంపై కూడా కక్ష పూరితంగా వ్యవహరించింది. ఈ అంశాన్ని ఇప్పుడు ప్రస్తావించడం వెనుక ఉద్దేశమేమిటంటే, స్వరూపానందేంద్ర స్వామికి ఏ నిబంధనల మేరకు , ఏ ధరకు గత ప్రభుత్వం భూములను కేటాయించిందో, అవే నిబంధనల ప్రకారం, అదే ధరకు మరో స్వామిజీకి ప్రస్తుతం ప్రభుత్వం భూములను కేటాయించింది. ఇక్కడ స్వామిజీ పేర్లు అప్రస్తుతం. స్వరూపానందేంద్ర స్వామితో పాటుగా మరికొందరు స్వామిజీలకు కూడా గత ప్రభుత్వం భూములు ఇచ్చింది. ఇప్పుడా భూములను కూటమి ప్రభుత్వం కానీ, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కాని పట్టించుకోవడం లేదు. అదే సమయంలో తిరుమల కాటేజీల విషయంలో కూడా చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయి. అక్రమ కట్టడాలు అంటూ చాలా కాలేజీలకు నోటీసులు ఇచ్చారు కానీ కేవలం స్వరూపానందేంద్ర స్వామి కాటేజీని మాత్రం కూలగొట్టారు. ఆంధప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) సొంత జిల్లాలో వరదయ్యపాలెం అనే గ్రామంలో కల్కి ఆశ్రమ నిర్మాణం జరిగింది. రెండు దశాబ్దాల కిందట ఆశ్రమం వెలిసింది. ఈ ఆశ్రమ నిర్మాణం కోసం తీసుకున్న భూములలో దళితులకు చెందినవి ఉన్నాయి. దళిత రైతులకు ప్రభుత్వం అసైన్‌మెంట్ కింద ఇచ్చిన భూములను కల్కి ఆశ్రమం కోసం తీసుకుని అక్కడ ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆశ్రమానికి ఎవరైనా వెళ్లాలంటే పర్మిషన్ తీసుకోవాలి,. ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో ఉన్నవారు కూడా అక్కడికి సులభంగా వెళ్లలేరు. ఆశ్రమ ప్రారంభోత్సవం జరిగేనాటికి కొంతమంది మరణించారు . బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందిందా అంటే లేదనే చెప్పాలి. ఇక్కడ పాయింటేమిటంటే గత ప్రభుత్వం స్వరూపానందేంద్ర స్వామికి ఇచ్చిన భూములను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం దళిత భూములను ఆక్రమించి నిర్మించిన ఆశ్రమాన్ని ఎందుకు తొలగించడం లేదన్న ప్రశ్న ఉత్పన్నమవుతొంది,