Arrest Fear In AP : అరెస్టులు, బెదిరింపులు వెనుక భయం!
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) అరెస్టులు(Arrest), కేసులు, బెదిరింపులు సాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) అరెస్టులు(Arrest), కేసులు, బెదిరింపులు సాగుతున్నాయి. గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం అధికారికంగానే ఓ డ్రైవ్ చేస్తున్నది. సోషల్ మీడియాపైన(Social media) కేసులు పెడుతోంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిని అరెస్ట్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High court) కల్పించుకున్నది కాబట్టి అరెస్ట్‌లు తగ్గాయి కానీ లేకపోతే అనేకమంది కటకటాల వెనుక ఉండేవారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితి ఏమిటి? బయటకు వెళితే తమను తిడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్(Pawan kalyan) ఆ మధ్యన అన్నారు. 'డీజీపీగారు ఏం చేస్తున్నారు? హోమ్‌మంత్రిగారు మీరు ఏం చేస్తున్నారు? నేను గనక హోంశాఖను తీసుకుంటే ఒక్కొక్కడి తాట తీస్తా' అంటూ పవన్ కల్యాణ్ రెచ్చిపోయి ప్రసంగించారు. పవన్ ఈ మాట అన్న మరుసటి రోజే కేబినెట్ మీటింగ్(Cabinet meeting) జరిగింది. మంత్రివర్గ సమావేశంలో మాత్రం పవన్ ఇంకేదో చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో తన కూతుళ్లను తిడుతూ ఉంటే ఎవరూ పట్టించుకోలేదని, ఆ కోపంతోనే తాను అలా మాట్లాడానని హోంశాఖ మంత్రికి పవన్ కల్యాణ్ సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేశారని, సారీ కూడా చెప్పారని తెలుగుదేశంపార్టీ(TDP) అనుకూల మీడియాలో వచ్చింది. నిజానికి హోంమంత్రికి(Anitha Vangalapudi) పవన్ వివరణ ఇచ్చుకోరు. హోంమంత్రే పవన్‌కు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పవన్ ప్రభుత్వంలో భాగస్వామి. పైగా ఉప ముఖ్యమంత్రి కూడా! పవన్‌కు వచ్చిన అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత హోం మంత్రిపై ఉంటుంది. ఇది వదిలేసి హోం మంత్రికి పవన్ వివరణ ఇచ్చుకున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా రాసుకొచ్చింది. ఏపీలో మీడియా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ అంశాన్ని ప్రభుత్వం తెలివిగా సోషల్ మీడియాపై నెట్టేసింది. సోషల్ మీడియాలో ఎవరైనా మహిళల గురించి అడ్డమైన రాతలు రాసినా , చిన్నారుల విషయంలో తప్పుగా మాట్లాడినా, రాజకీయ నాయకుల కుటుంబంపై తప్పుడు కూతలు కూసినా, బూతులు మాట్లాడినా, తప్పుడు ప్రచారం చేసినా తాట తీయాల్సిందే. అయితే దీన్ని బూచిగా చూపించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై వందలాది కేసులు నమోదు చేసుకుని రాజకీయంగా ఆడుకోవాలని చూస్తోంది తెలుగుదేశం పార్టీ(TDP).