రాజ్యసభ సభ్యులే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) ధైర్యం, ధీమా !
రాజ్యసభ సభ్యులే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) ధైర్యం, ధీమా ! రాజ్యసభలో వైసీపీకి చెందిన 11 మంది సభ్యులు ఉన్నారు. కేంద్రంలో తమ మద్దతు తప్పనిసరిగా ఉంటుందని, కీలకమైన తమ సభ్యుల మద్దతు కేంద్రానికి అవసరం కాబట్టి కేంద్రం తమతో కూడా సఖ్యంగా ఉండాలని వైసీపీ ఆశిస్తోంది. తమతో స్నేహంగా ఉండాల్సిన అవసరం కేంద్రానికి కచ్చితంగా ఉంటుందని వైసీపీ భావిస్తోంది. అయితే ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల తర్వాత ఎన్డీయే(NDA) కూటమికి రాజ్యసభలో మెజారిటీ వచ్చింది. రాజ్యసభలో ఎన్డీయే కూటమికి మెజారిటీ రావడం ఇదే ప్రథమం. ఇప్పుడు బీజేపీకి(BJP) ఇతరుల అవసరం లేదు. అంటే అటు ఇండియా కూటమిలోనూ, ఇటు ఎన్డీయే కూటమిలోనూ లేని పార్టీల అవసరం బీజేపీకి ఉండదు. ఇప్పుడున్న పరిస్థితులలో రాజ్యసభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా ఎన్డీయేకు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 11 రాజ్యసభ స్థానాలు ఉంటే మొత్తం 11 స్థానాలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. ఈ రాజ్యసభ స్థానాలపైన కూటమి(Alliance) నేతలు కన్నేశారు. ఈ రాజ్యసభ స్థానాలన్నింటినీ తిరిగి దక్కించుకోవడం ద్వారా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అస్తవ్యస్తంగా మార్చాలనే ప్లాన్‌ను కూటమి నేతలు వేశారు. అందులో భాగంగానే తెలంగాణలో ఇటీవల ఓ ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకున్నదో, ఒరిషాలో జరిగిన ఘటనను ఆదర్శంగా తీసుకున్నదో తెలియదు కానీ ఆ తరహా ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. ఒడిషాలో బిజూ జనతాదళ్‌కు చెందిన ఓ మహిళా రాజ్యసభ సభ్యురాలు రాజీనామా చేశారు. భారతీయ జనతాపార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలంగాణలో కూడా ఇదే జరిగింది. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కె.కేశవరావు కాంగ్రెస్‌లో చేరారు. పనిలో పనిగా తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా కేశవరావు రాజీనామా చేశారు. ఆ స్థానంలో కాంగ్రెస్‌కు(Congress) చెందిన అభిషేక్ సింఘ్వీ గెలుపొందరు. 2026 వరకు ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు లేవు. ఈలోపే రాజ్యసభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు స్థానం లేకుండా చేయాలనుకుంటోది తెలుగుదేశం పార్టీ.