అదానీ(adani) వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీయడం చూస్తున్నాం.

అదానీ(adani) వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీయడం చూస్తున్నాం. రాజ్యసభలో(Rajya sabha) కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna kharge) మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌ అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. అయితే అదానీ వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికాలో అదానీ బండారం బయపడిన తర్వాత కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాహుల్ గాంధీ(Rahul gandhi) విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఓ విలేకరి ఓ ప్రశ్న వేశారు. ' మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కూడా అదానీతో వ్యాపారాలు చేస్తున్నారు. అదానీకి ప్రాజెక్టులు ఇస్తున్నారు. అదానీ ఇచ్చే డొనేషన్లు కూడా తీసుకుంటున్నారు. వీటిని ఎలా జస్టిఫై చేసుకుంటారు? ' అని అడిగితే తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోవాల్సిందేనని రాహుల్‌ తెలిపారు. ఈ మాట రాహుల్‌గాంధీకి కాస్త ఇబ్బంది కలిగించింది. బహుశా ఆయన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదేశించినట్టుగా ఉన్నారు. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ(Telangana skill university) కోసం అదానీ ఇచ్చిన 100 కోట్ల రూపాయలను వెనక్కి ఇచ్చేసింది ప్రభుత్వం. ఇక్కడితో తెలంగాణ సంబంధించి ఇష్యూ క్లోజ్‌ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి జగన్మోహన్‌రెడ్డి పాలనలో అదానీతో కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందం వెనుక ప్రభుత్వ అధినేతకు ముడుపులు అందాన్నది విపక్షాల ఆరోపణ. గౌతమ్‌ అదానీ నుంచి జగన్‌కు 1750 కోట్ల రూపాయలు తీసుకున్నారని అంటున్నాయి. ఈ విషయంపై కూటమి నేతలు మౌనం పాటిస్తున్నారు. కూటమి నేతల మౌనం ఆంధప్రదేశ్‌కు శాపంగా మారింది. జగన్మోహన్‌రెడ్డి ఒక్కతే తప్పు చేశారంటూ తెలుగుదేశంపార్టీ అనుకూల మీడియా రాస్తూ వస్తున్నది. తప్పు చేసిన వారందరినీ శిక్షించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు నష్టం కలిగించే ఒక నిర్ణయాన్ని అప్పటి ముఖ్యమంత్రి జగన్‌(YS Jagan) తీసుకుంటే, అప్పటి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంలో అదాని కూడా భాగస్వామి అయి ఉంటే, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఒప్పందం(Power purchase Contract) కుదుర్చుకుంటే ఎంత లాభం వస్తే 1750 కోట్ల రూపాయలు ముడుపులు ఇస్తాడు అదానీ? ఆ ఒప్పందాన్ని ఇప్పుడు మనం రద్దు చేయకపోతే ఆంధ్రప్రదేశ్‌కు ఎంత నష్టం జరుగుతుంది? ఆ ఒప్పందాలను రద్దు చేయాలి కదా! అదానీ దేశ వ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా అక్రమ వ్యాపారాలు చేస్తున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో , కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంపై మాట్లాడుతూ వస్తున్న సమయంలో కూటమి నేతలు మౌనం ఎందుకు పాటిస్తున్నారు? అదానీతో చేసుకున్న విద్యత్ ఒప్పందాలను రద్దు చేయాలి కదా? ఈ ఒప్పందం వల్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై లక్షల కోట్ల రూపాయల భారం పడుతుందని తెలుగుదేశంపార్టీ(TDP) అనుకూల మీడియా చెబుతున్నది కదా! మరి ప్రజలపై అంతటి భారాన్ని మోపే ఈ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయడం సముచితము కదా! కెన్యాలాగో, బంగ్లాదేశ్‌లాగో అదానీతో తాము వ్యాపారం చేయమని చెప్పాలి కదా! అవినీతి లేని ఆంధ్రప్రదేశ్‌ ఉండాలని పదే పదే చెబుతూ ఉండే చంద్రబాబు మరి ఈ అవినీతి ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయడం లేదు? ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నది? ఎందుకు ఆలస్యం చేస్తున్నది? దేశ వ్యాప్తంగా అదానీ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే కూటమి నేతలు ఏమీ పట్టనట్టుగా ఎందుకు ఉంటున్నారు? అదానీతో కేవలం విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందం మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్‌ ఉంది. పోర్టులు, భూముల కేటాయింపులకు సంబంధించిన వ్యవహారాలు కూడా ఉన్నాయి. ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందు జగన్‌తో అదానీ రెండు మూడు సార్లు సమావేశం అయ్యారని టీడీపీ అనుకూల మీడియా రాస్తున్నది. చంద్రబాబునాయుడు కూడా ఇటీవల అదానీతో రెండు మూడు సార్లు సమావేశం అయ్యారు. ఈ సమావేశాలు ఎందుకు జరిగాయి? గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కొనసాగించడానికి మీట్ అయ్యారా? ఇలా కొనసాగిస్తే చంద్రబాబుకు ఏమైనా లబ్ధి చేకూరుతుందా? అన్న అనుమానాలు ఎవరికైనా వస్తాయి. చంద్రబాబు తక్షణ కర్తవ్యమేమిటంటే అదానీని ఆంధ్రప్రదేశ్‌ నుంచి బయటకు పంపేయడం. అదాని రహిత ఆంధ్రప్రదేశ్‌ కావాలని కోరుకోవాలి కదా! అదాని అవినీతిపరుడైన వ్యాపారి అని అంటూనే అదానీని ఏమీ అనకపోవడం ఏమిటి? ఆంధ్రప్రదేశ్‌లో అదానీతో సంబంధం లేని వ్యాపారాలే ఉండాలని సర్కారు భావించాలి కదా! పోర్టుతో అదానీ చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి కదా! ఒక ప్రాజెక్టుకే జగన్‌కు అదానీ లంచం ఇచ్చాడంటే మిగతా ఒప్పందాలకు కూడా ఇచ్చే ఉంటాడు కదా! వాటన్నింటినీ రద్దు చేయడం ప్రస్తుత ప్రభుత్వం కర్తవ్యం కాదా?



Updated On 26 Nov 2024 8:54 AM GMT
Eha Tv

Eha Tv

Next Story