విజయవాడ(Vijayawada) మునిగిపోయింది. మునిగిపోతోంది. విజయవాడ ఇంకా ఇబ్బందులు పడుతోంది.

విజయవాడ(Vijayawada) మునిగిపోయింది. మునిగిపోతోంది. విజయవాడ ఇంకా ఇబ్బందులు పడుతోంది. విజయవాడ నగరం గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో రోజుల తరబడి నీళ్లల్లో నానాల్సిన పరిస్థితి ఏర్పడింది. లక్షల మంది ప్రజలు వరదలో చిక్కుకుని ఉన్నారు. విజయవాడ నగరానికి సంబంధించి కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. అదేమీ మారుమూల ప్రాంతం కాదు. అలాగని ఏజెన్సీ ప్రాంతం కూడా కాదు. మనుషులు వెళ్లలేని ప్రాంతం కాదు. పూర్తిగా పట్టణ ప్రాంతంలో కూడా ప్రజలు ఈ స్థాయిలో ఇంకా వరద సాయం అందక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ స్థాయిలో వరద చుట్టుముట్టింది. నిజానికి కృష్ణా నదికి ఎప్పుడు వరదలు వచ్చినా ప్రకాశం బ్యారేజ్‌ దిగువున ఉన్న కృష్ణలంక ప్రాంతానికి చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. ఆ కృష్ణలంక ప్రాంతంలోకి పెద్ద ఎత్తున వరద నీరు రావడం, రెండు మూడు రోజుల పాటు వారంతా ఇబ్బందులు పడటం, అందరిని పునరావాస కేంద్రాలకు తరలించడం, వరద వెళ్లిపోయిన తర్వాత తిరిగి వారిని నివాసాలకు చేర్చడం జరుగుతూ వస్తున్నది. ఈ తరహా కార్యక్రమాలు రోటిన్‌గా జరుగుతుంటాయి. అయితే ఈసారి కరకట్ట నిర్మాణం జరిగిన నేపథ్యంలో కృష్ణలంక(Krishnalanka) ప్రాంతానికి సంబంధించిన వారిపైన కృష్ణానది వరద పడలేదు కానీ ఎగువభాగంలోంచి వదర విజయవాడ నగరాన్ని పూర్తిగా ముంచేసింది. సింగ్‌నగర్‌లాంటి(singnagar) ప్రాంతంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా వరదనీరు వచ్చింది. వరద ఈ స్థాయిలో విజయవాడ వంటి నగరాన్ని ముంచెత్తడానికి కారణం అక్రమ నిర్మాణాలు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ అంశానికి సంబంధించి ఎవరినో ఒకరిని నిందించి, ఎవరిపైనో నింద వేసి లాభం లేదు. పాలక, ప్రతిపక్ష పార్టీ రెండూ బాధ్యత తీసుకోవాలి. అక్రమ నిర్మాణాల కారణంగానే ఈ రోజు విజయవాడ ప్రజలు ఇబ్బందిపడే పరిస్థితి వచ్చింది. విజయవాడ నగరం బేసిక్‌గానే ఇరుకైన నగరం. జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఇరుకు రోడ్లు, ఇరుకు సందులు ఎక్కువగా ఉంటాయి. సో అటువంటి నగరంలో వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. వరద సాయం అందించడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి కారణం అక్రమ నిర్మాణాలే! ఈ అక్రమ నిర్మాణాలకు బాధ్యులు ఎవరు? ఇంతవరకు పాలించిన పార్టీలదే తప్పు. అక్కడున్న స్థానిక ప్రభుత్వాలు కూడా బాధ్యత తీసుకోవాలి. స్థానికంగా ఉన్న నాయకుల ప్రమేయంతోనే నాలాలపై అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దాంతో వరద నీరు ఎటూ వెళ్లలేని పరిస్థితులలో విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. దాంతో పాటు కొంత మంది కొంత సైంటిఫిక్‌గా చెబుతున్నదేమిటంటే వరద కృష్ణానదికి విపరీతంగా ఫ్లో అవుతున్న సమయంలో ఆ వరద నీళ్లు చాలా స్పీడ్‌గా ఆ నదిలో ఫ్లో అవుతున్న సందర్బంలో చుట్టుపక్కల నుంచి వచ్చే వరద కృష్ణా నదిలోపలికి వెళ్లడానికి కష్టమవుతోంది. ఇప్పుడు విజయవాడకు వచ్చిన కష్టం భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి సమాధానం తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి.



Eha Tv

Eha Tv

Next Story