రాజకీయపార్టీలు(Politicalparties) ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం

రాజకీయపార్టీలు(Politicalparties) ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి మంగళం పాడటం మనకు కొత్తకాదు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కూడా గతంలో అనేక సందర్భాలలో రాజకీయపార్టీలు ఇలాగే హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన సందర్భాలను చాలానే చూశాం. 1995లో చంద్రబాబునాయుడు(Chandrababu) చాలా తెలివిగా, రెండు పత్రికల సాయంతో ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. 1994లో ఎన్టీఆర్‌(NTR) ఎన్నికల ముందు రెండు ప్రధానమైన హామీలను ఇచ్చారు. ఒకటి సంపూర్ణ మద్య నిషేధం(Alcohol ban). రెండవది రెండు రూపాయలకు కిలో బియ్యం. ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నంత వరకు ఈ రెండు హామీలను నెరవేరాయి. ఎన్టీఆర్‌ నుంచి అధికారాన్ని లాగేసుకున్న చంద్రబాబు మద్యనిషేధాన్ని ఎత్తేశారు. రెండు రూపాయల కిలోబియ్యం పథకాన్ని అటకెక్కించారు. అప్పుడు ఎందుకిలా చేశారని ఎవరూ ప్రశ్నించలేదు. ప్రశ్నించాల్సిన పత్రికలు కూడా చంద్రబాబుకు వత్తాసు పలికాయి. 2019లో అధికారంలోకి రాక మునుపు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓ హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే మధ్య నిషేధాన్ని దశల వారిగా అమలు చేస్తామని, వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని చెప్పింది. రాష్ట్రంలో మద్యం షాపులే లేకుండా చేస్తామంది. ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో మాత్రమే మద్యం అందుబాటులో ఉంటుందని పేర్కొంది. పేదలకు మద్యం అందుబాటులో ఉండకుండా చూస్తామని వై.ఎస్.జగన్‌(YS Jagan) తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని పట్టించుకోలేదు. ఈ విషయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YSRCP) పార్టీ అట్టర్ ఫ్లాప్‌ అయ్యింది. ఇందుకు ఆ పార్టీ బోల్డన్ని కారణాలు చెప్పవచ్చుగాక, హామీని అమలు చేయడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యిందన్నది నిజం. అలాగే సీపీఎస్‌ రద్దుకు సంబంధించి కూడా వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. తాము అవగాహనారాహిత్యంతో ఆ హామీని ఇచ్చామని, దాన్ని అమలు చేయడం అసాధ్యమని తర్వాత చెప్పుకుంది. ఇది ఒక విధంగా ఉద్యోగులను మోసం చేయడమే! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సారథ్యంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. దసరా సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఒక మోసాన్ని కానుకగా ఇస్తోంది. కచ్చితంగా ఇది మోసమే! ఇసుక రీచ్‌ల పేరుతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దోపిడీ చేసేసిందని, ఇసుక అందుబాటులో లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నారని చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పుకొచ్చారు. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలను దూరం చేసిందని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తామని గట్టి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినప్పటికీ కొత్త ఇసుక పాలసీని ఇంకా ప్రభుత్వం తీసుకురాలేదు. గత ప్రభుత్వ హయాంలో ముందు చూపుగా 75 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుకను అందుబాటులో వచ్చింది. వర్షాకాలంలో ఇసుక దొరకదు కాబట్టి ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ పని చేసింది. ఇప్పుడు ఆ 75 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వం దారుణమైన మోసాన్ని చేసింది. ప్రజలకు పంగనామాలు పెట్టింది.. ఏమిటా మోసం?



Eha Tv

Eha Tv

Next Story